తారక్‌ను టార్గెట్ చేసింది ఆ హరో ఫ్యాన్సే..?  

Mahesh Babu Meera Chopra - Telugu Mahesh Babu, Meera Chopra, Ntr, Social Media, Tollywood News

టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటూ నటి మీరా చోప్రా చేసిన కామెంట్స్‌తో ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గాలు ఉలిక్కి పడ్డాయి.ఈ వ్యవహారం కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో ఇది తారక్-మీరా చోప్రాల మధ్య వివాదంగా మారింది.

 Mahesh Babu Meera Chopra

దీంతో ప్రస్తుతం అందరూ ఈ వివాదం గురించే చర్చించుకుంటున్నారు.తనకు టాలీవుడ్‌లో మహేష్ బాబు ఇష్టమని అన్నందుకు తనను తారక్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారని ఆమె ఆరోపిస్తోంది.

అయితే అంతటితో ఆగకుండా తనను బెదిరిస్తున్నారంటూ మీరా చోప్రా ఏకంగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.అయితే ఓ నటిపై ఇలాంటి దాడి ముమ్మాటికి నేరం అని అంటున్నారు ఇతర హీరోల ఫ్యాన్స్.తాజాగా మహేష్ బాబు ఫ్యాన్స్ మీరా చోప్రాకు అండగా నిలుస్తున్నారు.

తారక్‌ను టార్గెట్ చేసింది ఆ హరో ఫ్యాన్సే..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

వారు సోషల్ మీడియాలో #wesupportmeerachopra అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆమెకు బాసటగా నిలుస్తున్నారు.

కాగా ఇదంతా పక్కా ప్రణాళికతోనే జరుగుందని, తారక్‌ను కావాలని ఈ వివాదంలోకి దించాలని పలువురు చూస్తున్నారని నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు.

వారు తారక్‌పై బురదజల్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం చెల్లవని, తమ హీరోను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని, ఇలాంటి చిల్లర వ్యవహారాలు ఇతర హీరోల వద్ద చూపించాలని వారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు.మరి ఈ వివాదం ఎటు నుండి ఎటు వెళ్తుందో చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Meera Chopra Related Telugu News,Photos/Pics,Images..