పవన్‌కు త్రివిక్రమ్.. మహేష్‌కు కూడా ఒకరు దొరికారు!

టాలీవుడ్‌లో స్టార్ హీరోలు కొంతమంది డైరెక్టర్లతో మంచి సంబంధాలు మెయింటెయిన్ చేస్తుంటారు.ఇలాంటి వారిలో అందరికంటే ముందుంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.

 Mahesh Babu Maintaining Close Relation With Vamsi Padipally-TeluguStop.com

వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఎలాంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయో అందరికీ తెలిసిందే.అయితే వీరు సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా చాలా సన్నిహితంగా ఉంటారు.

పవన్ కళ్యాణ్ వెంట త్రివిక్రమ్‌ను మనం చాలా సార్లు చూశాం.అయితే ఇలాంటి రిలేషన్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మెయింటెయిన్ చేస్తున్నాడు.మహేష్‌కు గతేడాది మహర్షి లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి పనితనానికి మహేష్ ఫిదా అయ్యాడు.అంతేగాక వంశీపైడిపల్లితో మహేష్ మంచి పర్సనల్ రిలేషన్‌ను మెయింటెయిన్ చేస్తున్నాడు.

మహేష్ కుటుంబంతో వంశీ పైడిపల్లి చాలా క్లోజ్‌గా కలిసిపోయాడట.

మహేష్ కూతురు సితారతో పాటు వంశీ కూతురు ఆధ్యలు ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్స్‌లో మహేష్‌ను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.

కాగా వంశీ పైడిపల్లితో మహేష్ తన నెక్ట్స్ మూవీని కూడా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.వీరి రిలేషన్ రీల్ లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ కొనసాగుతుండటంతో మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube