ఫైనల్‌గా మహర్షి పరిస్థితి ఏంటీ ఇంతకు బయ్యర్లు బయట పడ్డారా

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు 25వ చిత్రం మహర్షి చిత్రం ఫుల్‌ రన్‌ పూర్తి చేసుకుంది.థియేటర్ల నుండి పూర్తిగా తొలగించబడింది.50 రోజుల పాటు ఈ చిత్రం ఆడింది.తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 200 థియేటర్లలో ఈ చిత్రం 50 రోజులు ఆడిందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

 Mahesh Babu Maharshimovie 1-TeluguStop.com

అంత భారీగా ఆడితే కలెక్షన్స్‌ ఈజీగా రెండు వందల కోట్ల రూపాయలు నమోదు అవ్వాలి.కాని అక్కడి వరకు వెళ్లలేదు.అయితే బయ్యర్లను భలి చేయకుండా కాస్త పర్వాలేదు అనిపించింది.

మొన్నటి వరకు అక్కడో ఇక్కడో ఉన్న మహర్షి చిత్రం నేడు శుక్రవారం కొత్త సినిమాలు రావడంతో పూర్తిగా కనిపించకుండా పోయాడు.

లాంగ్‌ రన్‌ పూర్తి అవ్వడంతో మహర్షి మొత్తం వసూళ్లపై ఒక క్లారిటీ వచ్చేసింది.ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 105.4 కోట్ల రూపాయలను వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది.ఇదే సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి 100.6 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది.దాంతో సినిమా బయ్యర్లకు నష్టాలు మిగల్చకుండా లాభాలను మిగల్చకుండా క్లోజ్‌ అయ్యిందని అంటున్నారు.

ఫైనల్‌గా మహర్షి పరిస్థితి ఏం

నిర్మాతలు మాత్రం ఈ చిత్రంతో భారీగానే మూట కట్టుకున్నారు.100 కోట్లు థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారా దక్కగా మరో 50 కోట్లు ఇతర రైట్స్‌ ద్వారా వచ్చాయి.సినిమాకు వంద కోట్ల లోపు బడ్జెట్‌ అయ్యింది.ఇప్పుడు సినిమా వారికి దాదాపుగా 50 కోట్ల ప్రాఫిట్స్‌ను తెచ్చి పెట్టినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

బయ్యర్లు కొందరు కొద్దిగొప్ప లాభాలు దక్కించుకుంటే మరి కొందరు మాత్రం కాస్త నష్టపోయారు.ఓవరాల్‌గా చూసుకుంటే బయ్యర్లను ఏదోలా ఒడ్డున పడేసినట్లయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube