మహర్షి 100 కోట్ల షేర్‌ : ఇదేలా సాధ్యం అంటూ వారు జుట్టు పీక్కుంటున్నారు

మహేష్‌ బాబు 25వ చిత్రం ‘మహర్షి’ భారీ అంచనాల నడుమ తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సినిమాకు మొదటి రోజు నెగటివ్‌ టాక్‌ వచ్చింది.

 Mahesh Babu Maharshi Movie Reached In 100crores-TeluguStop.com

ఈ మాట అంటే అభిమానులకు కోపం అయితే రావచ్చు కాని, ఈ విషయాన్ని మొదటి రోజు కొందరు అభిమానులు స్వయంగా చెప్పుకొచ్చారు.ఇప్పుడు కూడా వారు అదే మాట అంటున్నారు.సినిమాకు రెండవ రోజు నుండి మెసేజ్‌ కారణంగా యావరేజ్‌ టాక్‌ నడిచింది.100 కోట్ల బిజినెస్‌ చేసిన మహర్షి చిత్రం యావరేజ్‌ టాక్‌తో ఎలా బ్రేక్‌ ఈవెన్‌ సాధిస్తుందని అంతా అనుకున్నారు.ఈ చిత్రం 60 నుండి 70 కోట్లు సాధిస్తే గొప్ప విషయం అని అంతా భావించారు.కాని మెల్ల మెల్లగా సినిమా 100 కోట్లకు చేరుకుని బ్రేక్‌ ఈవెన్‌కు సిద్దం అయ్యింది.

ఒక ఫ్లాప్‌ టాక్‌ మూవీకి ఏకంగా 100 కోట్లు ఎలా సాధ్యం అంటూ సినీ విశ్లేషకులు ట్రేడ్‌ వర్గాల వారు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.భరత్‌ అనే నేను చిత్రం బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ టాక్‌ను దక్కించుకుంది.ఆ సినిమా స్థాయిలోనే ఈ సినిమా కూడా వసూళ్లు రాబట్టడంకు కారణం ఏంటీ అంటూ విశ్లేషకులు లెక్కలు వేసే ప్రయత్నం చేస్తున్నారు.100 కోట్ల షేర్‌ను చేరుకుని టాలీవుడ్‌ టాప్‌ చిత్రాల జాబితాలో చేరిపోయింది.రికార్డు స్థాయిలో మహేష్‌ బాబు మహర్షి చిత్రం వసూళ్లను రాబట్టిన నేపథ్యంలో సరికొత్త రికార్డులు నెలకొల్పడం జరిగింది.

మహర్షి 100 కోట్ల షేర్‌ : ఇదేలా సా

భారీ ఎత్తున మహర్షి చిత్రం వసూళ్లు సాధించడానికి ప్రధాన కారణాలు మహేష్‌ బాబుకు ఉన్న క్రేజ్‌ మరియు సినిమాకు యూనిట్‌ సభ్యులు చేసిన ప్రమోషన్స్‌గా చెప్పుకోవచ్చు.సినిమాకు పెద్ద ఎత్తున ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహించిన కారణంగా సినిమాపై అంచనాలు, ఆసక్తి పెరిగి కలెక్షన్స్‌ పెరిగాయి.ఇక ప్రేక్షకులను ఎమోషనల్‌గా రైతు సబ్జెక్ట్‌ అంటూ అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు.

మొత్తానికి మహర్షి చిత్రంతో మహేష్‌ బాబు మరోసారి తన సూపర్‌ స్టార్‌ డంను కనబర్చాడు.అద్బుతమైన తన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను ఈ చిత్రంతో మరోసారి నిరూపించుకున్నాడు.ఈ విషయంలో మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీగా ఉన్నాడు.మిశ్రమ స్పందన వచ్చిన సినిమాతో వంద కోట్లు సాధించడం కేవలం మహేష్‌ బాబు వల్లే సాధ్యం అని ఫ్యాన్స్‌ గొప్పగా చెప్పుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube