'మహర్షి' సినిమాకు జాతీయ అవార్డుపై ట్రోల్స్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన మహర్షి సినిమా కు జాతీయ అవార్డు రావడం పట్ల పలువురు పలు రకాలుగా సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.ముఖ్యంగా ఈ సినిమాలోని డాన్స్ కొరియోగ్రాఫీకి ఉత్తమ కొరియోగ్రాఫర్‌ అవార్డు రావడం చర్చనీయాంశంగా మారింది.

 Mahesh Babu Maharshi Movie National Award Gets Trolls , Mahesh Babu , Maharshi-TeluguStop.com

అసలు ఈ సినిమాలో బూతద్దం పెట్టి వెదికినా అదిరి పోయే స్టెప్పులు కనిపించవు కదా ఎలా ఈ సినిమా కొరియోగ్రాఫర్‌ కు అవార్డు వచ్చిందని అంటున్నారు.ఆయనకు ఇవ్వాలనుకుంటే ఆయన చేసిన మరేదైనా సినిమాకు ఇచ్చి ఉంటే బాగుండేది కదా మహర్షి సినిమాలో గొప్ప డాన్స్ లు లేకున్నా అవార్డు ఇవ్వడం వల్ల నమ్మకం కలుగడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

జాతీయ అవార్డులకు ఎంపిక అయిన సినిమాలు మరియు నటీ నటులను చూస్తుంటే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అంటూ నెటిజన్స్ నిన్నటి నుండి తెగ ట్రెడ్డింగ్‌ చేస్తున్నారు.
మహర్షి సినిమా కు రెండు అవార్డులు రావడం చాలా సంతోషం కలిగించే విషయం.

తెలుగు వారు అంతా కూడా గర్వించే విషయం.వ్యవసాయం బ్యాక్ డ్రాప్‌ లో రూపొందిన సినిమా అవ్వడం వల్ల మహర్షికి అవార్డు రావడం మంచిదే.

కాని బెస్ట్‌ పాపులారిటీ సంపాదించిన అవార్డును ఈ సినిమా కు ఇవ్వడం కాస్త విడ్డూరంగా ఉందని అంటున్నారు.మొత్తానికి మహర్షి సినిమా అవార్డులను కొందరు ట్రోల్‌ చేస్తున్నారు.

కేవలం మహర్షి అవార్డులను మాత్రమే కాకుండా కంగనా అవార్డులను కూడా ట్రోల్‌ చేస్తున్నారు, రైతుల ఉద్యమం సమయంలో కేంద్రంకు మద్దతుగా ఆమె నిలవడం వల్లే అవార్డు వచ్చిందని కూ డా అంటున్నారు.మొత్తగానికి గడచిన 24 గంటలుగా జాతీయ అవార్డుల సందడి సోషల్‌ మీడియాలో కనిపిస్తుంది.

విమర్శించే వారు ఎప్పుడైనా విమర్శిస్తూనే ఉంటారు అంటూ విజేతలు హాయిగా ఎంజాయ్ చేయడం బెటర్‌ అనేది మా సలహా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube