టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న యువ హీరోలలో నెంబర్ వన్ ఎవరంటే వెంటనే మహేష్ బాబు అని చెప్పేస్తారు.మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఉన్న స్థానాన్ని మహేష్ బాబు ఇప్పుడు ఆక్రమించేసాడు.
ఈ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అంటే నిర్మాతలు దర్జాగా వంద కోట్లు జేబులో వేసుకోవచ్చు అనే ధీమాని ఈ మధ్య వరుసగా రెండు హిట్స్ తో ఇచ్చాడు.ఇక ఇతని సినిమా అన్నా కూడా బడ్జెట్ సుమారు డెబ్బై కోట్ల వరకు నిర్మాతలు సిద్ధం చేసుకోవాల్సిందే అనే టాక్ కూడా బలంగా వినిపిస్తుంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధిక బడ్జెట్ హీరోలుగా ఫస్ట్ ప్లేస్ లో ప్రభాస్ ఉంటే తరువాత మహేష్ ఉన్నాడు.
ఇక మహేష్ బాబు కి ఉన్న బ్రాండ్ వేల్యూ ని అతను బిజినెస్ స్ట్రాటజీకి భాగా ఉపయోగించుకుంటున్నాడు.
ఇప్పటికే నిర్మాతగా మారిపోయిన మహేష్ తన ప్రతి సినిమకి తానొక నిర్మాణ భాగస్వామిగా ఉంటున్నాడు.కొద్ది నెలల క్రితం ఏఏంబి మల్టీప్లెక్స్ స్టార్ట్ చేసి థియేటర్స్ బిజినెస్ లోకి దిగిపోయాడు.
మరో వైపు ప్రముఖ బ్రాండ్ లకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ కోట్లు సంపాదిస్తున్నాడు.ఇప్పుడు తన బ్రాండ్ వేల్యూతో ఫాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టేస్తున్నాడు.త్వరలోనే సొంత దుస్తుల బ్రాండ్ ను ప్రారంభించబోతున్నట్లు సమాచారం.తమ దుస్తులను www.spoyl.in/mahesh-babu వెబ్ సైట్ లో ఆవిష్కరిస్తామని మహేశ్ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.