పోటికి ఎవరు వస్తారో రండి అంటున్న మహేష్     2017-01-15   22:36:31  IST  Raghu V

సంక్రాంతి పండగ అనగానే సినిమా వాళ్లకు పండగ. ఈ సీజన్ తో రెండు మూడు సినిమాలు విడుదలయిన సరే, ప్రేక్షకులు పండగ సంబరాల్లో భాగంగా ఆదరిస్తారు. అందుకే, సినిమాకి యావరేజ్ టాక్ వచ్చిన ఆడేస్తుంది.

గత ఏడాది నాలుగు సినిమాలు వస్తే, మూడు సినిమాలు బాగా ఆడాయి, ఈ ఏడాది కూడా సంక్రాంతికి నాలుగు సినిమాలు వస్తే, అందులో మూడు బాగా ఆడుతున్నాయి. పోటిలో కూడా సినిమాలు ఆదరగోట్టడం సంక్రాంతికి మాత్రమే చూసే వింత. అందుకే మహేష్ బాబు సంక్రాంతి సెలవులని టార్గెట్ గా పెట్టుకున్నాడని తెలుస్తోంది. కంగారుపడకండి .. సంక్రాంతికి వచ్చేది మురుగదాస్ సినిమా కాదు. కొరటాల శివ సినిమా.

మొదట ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని భావించినా’, మహేష్ మురుగదాస్ తో చేస్తున్న సినిమా ఆలస్యం అవుతుండటంతో వచ్చే ఏడాది సంక్రాంతికి స్కెచ్ వేశాడట కొరటాల. సంక్రాంతి అంటే ఎదో ఒక పెద్ద సినిమాతో పోటి తప్పదు. అయినా సరే, పోటికి ఎవరు వస్తారో రండి అని అంటున్నాడు సూపర్ స్టార్. మహేష్ సినిమాలు ఇంతకుముందు సంక్రాంతి పోటిలో చాలావరకు బాగా ఆడాయి. ఒక్కడు, బిజినెస్ మెన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలు సంక్రాంతి పోటిని గెలిస్తే, 1 – నేనొక్కడినే చిత్రం ఒకటే అపజయం పాలైంది.

ఈరకంగా మహేష్ ట్రాక్ రికార్డ్ సంక్రాంతి పోటిలలో బ్రహ్మాండంగా ఉంది. అందుకే మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో సంక్రాంతికి వచ్చే ఆలోచనలో ఉన్నాడు.

డివివి దానయ్య నిర్మించనున్న ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఉంటారని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే కీర్తి సురేష్ పేరుని ఓ హీరోయిన్ పాత్ర కోసం పరిశీలిస్తున్నారట.