మహేష్ కి అతని అవసరం పడిందా?

మహేష్ బాబు స్క్రిప్టు సెలెక్షన్ గమ్మత్తుగా ఉంటుంది.అయితే అతివృష్టి , లేదా అనావృష్టి అన్నట్లుగా, ఒక్కడు,పోకిరి,అతడు, శ్రీమంతుడు లాంటి క్లాసిక్స్ ఉంటాయి, మరోవైపు బాని,సైనికుడు,ఆగడు,బ్రహ్మోత్సవం లాంటి చెత్త సినిమాలూ ఉంటాయి.

 Mahesh Babu – Koratala Siva Film On Cards Again-TeluguStop.com

అందుకే మహేష్ కెరీర్ ఎప్పుడూ ఒకే ఊపులో సాగలేదు.

పోకిరి తరువాత చెప్పుకుంటే, వరుసగా మూడు అపజయాలు, తరువాత మూడు విజయాలు,మళ్లీ రెండు డిజాస్టర్లు, ఒక బ్లాక్ బస్టర్ వచ్చిన వెంటనే, ఇప్పుడు మరో డిజాస్టర్.

ఏది ఏమైనా, శ్రీమంతుడు అనే సినిమా, ఇన్ని అపజయాల నడుమ మహేష్ అభిమానుల ఆకలి తీర్చింది.అందుకే కొరటాల శివ అంటే మహేష్ కి ప్రత్యేక అభిమానం.

మురుగదాస్ తో తదుపరి సినిమా చేయబోతున్న మహేష్, ఆ తరువాత కొరటాల శివతో మరో సినిమా చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.నిజానికి ఓ నాలుగు నెలలు ముందే తమ కాంబినేషన్లో రెండో ప్రాజెక్టు మాట్లాడుకున్నారు ఈ ఇద్దరు.

బ్రహ్మోత్సవం ఫ్లాప్ అవడం వలన బహుషా, మహేష్ కి వెంటనే కొరటాల గుర్తొచ్చారు.శివకి ఫోన్ చేసి “మనం మరో సినిమా చేస్తున్నాం, కథ సిద్ధం చేసుకో” అని చెప్పాడట సూపర్ స్టార్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube