సర్కారు వారి పాట రివ్యూ: మహేష్ వన్ మ్యాన్ షో అంతే!

డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాలో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించారు.

 Mahesh Babu Keerthy Suresh Sarkaru Vari Paata Review And Rating Details, Sarkru-TeluguStop.com

అంతేకాకుండా వెన్నెల కిషోర్, సముద్రఖని తదితరులు నటించారు.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన లుక్స్, టీజర్స్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

దీంతో సినిమాపై ప్రేక్షకుల నుండి బాగా అంచనాలు వెలువడ్డాయి.మొత్తానికి ఈ సినిమా కోసం ఎదురు చూడగా ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక దీంతో ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో.అంతే కాకుండా మహేష్ బాబు కు ఎటువంటి సక్సెస్ అందుతుందో చూద్దాం.

కథ:

ఇందులో మహేష్ బాబు మహి అనే పాత్రలో వడ్డీ వ్యాపారిగా కనిపిస్తాడు.ఇక ఈయనకు చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనల వల్ల డబ్బు విషయంలో సీరియస్ గా వ్యవహరిస్తూ ఉంటాడు.

ఇక తను ఎవరికైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బు వసూలు చేసుకోవడానికి ఎంత కష్టమైన పడుతాడు.ఆ సమయంలో అతను యూఎస్ కు వెళ్లగా అక్కడ ఆయనకు కళావతి (కీర్తి సురేష్) పరిచయమవుతుంది.

ఇక ఆమె చదువు కోసం మహి నుండి అప్పు తీసుకుంటుంది.ఇక ఆమెతో ప్రేమలో కూడా పడతాడు మహి.దాంతో తనకు అడిగినంత డబ్బు ఇస్తూ ఉంటాడు.ఆ సమయంలో వ్యాపారవేత్తగా ఉన్న రాజేంద్రనాథ్ (సముద్రఖని), మహి ల మధ్య చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారుతుంది.

ఇక రాజేంద్రనాథ్ పెద్ద స్కామ్ ను మహీ బయటపెడతాడు కూడా.అలా ఆ రాజేంద్రనాథ్ ఎవరు.మహికి చిన్నప్పుడు జరిగిన పరిస్థితులే ఏంటి అనేది మిగిలిన కథ లో చూడవచ్చు.

Telugu Actresskeerthi, Parashuram, Mahesh Babu, Samudrakhani, Sarkruvaari, Tolly

నటినటుల నటన:

ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.పైగా తన లుక్ కూడా బాగా అదిరిపోయింది.ఇక మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

ఈ సినిమాలో తన అందంతో, తన కామెడీ టైమింగ్ తో, తన నటనతో మరోసారి ఫిదా చేసింది.ఇక వెన్నెల కిషోర్ తన కామెడీ తో బాగా నవ్వించాడు.విలన్ గా సముద్రఖని ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

టెక్నికల్:

టెక్నికల్ పరంగా ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఆకట్టుకుంది.ఇక సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.డైరెక్టర్ తన కథతో ప్రేక్షకులను మెప్పించగలిగాడు.డైలాగ్స్, స్క్రీన్ ప్లే బాగా ఉన్నాయి.ఇక ఎడిటింగ్ లో కాస్త మార్పులు కనిపించాయి.

Telugu Actresskeerthi, Parashuram, Mahesh Babu, Samudrakhani, Sarkruvaari, Tolly

విశ్లేషణ:

ఇక ఈ సినిమాల్లో డైరెక్టర్ హీరో పాత్రను అద్భుతంగా చూపించాడు.అతడు చిన్నప్పుడు పడ్డ కష్టాలను దానిని పట్టుదలగా తీసుకొని పెద్దయ్యాక దాని పట్ల వ్యవహరించిన తీరు బాగా ఆకట్టుకుంది.ఇక డైరెక్టర్ స్క్రీన్ ప్లే విషయంలో బాగా చూపించాడు.డైలాగ్స్, మాస్, క్లాస్ సన్నివేశాలు బాగా చూపించాడు.హీరో హీరోయిన్ మధ్య కొన్ని సన్నివేశాలను బాగా నవ్వించే విధంగా చూపించాడు.కానీ సెకండాఫ్ లో ప్రేక్షకులు నిరాశ చెందినట్లు కనిపిస్తుంది.

సెకండాఫ్ మొత్తం స్లోగా సాగినట్లు ఉంది.

Telugu Actresskeerthi, Parashuram, Mahesh Babu, Samudrakhani, Sarkruvaari, Tolly

ప్లస్ పాయింట్స్:

మహేష్ బాబు, కీర్తి సురేష్ పాత్రలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, సాంగ్స్.

మైనస్ పాయింట్స్:

ఎడిటింగ్ లో కాస్త పొరపాట్లు కనిపించాయి.సెకండాఫ్ లో మరి కాస్త జాగ్రత్త పడితే సరిపోయేది.ప్రీ క్లైమాక్స్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

బాటమ్ లైన్:

ఇక ఈ సినిమా కథ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది.కామెడీ పరంగా ప్రేక్షకులకు బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.దర్శకుడు ఈ సినిమా కథ తీరును ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చూపించాడు.

రేటింగ్: 2.5/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube