సర్కారు వారి పాట కి అక్కడ నాన్‌ రాజమౌళి రికార్డ్‌ ఖాయం

మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట సినిమా తెరకెక్కింది.మే 12వ తారీకున ఈ సినిమా ను విడుదల చేయబోతున్నారు.

 Mahesh Babu Keerthy Suresh Sarkaru Vaari Paata Movie Us Business , Keerthy Sure-TeluguStop.com

తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబుకు ఉన్న నేపథ్యంలో భారీ విడుదల ఖాయం.ఇప్పడు యూఎస్ లో కూడా ఈ సినిమా ను ఏకంగా 700 లొకేషన్స్‌ లో విడుదల చేయబోతున్నారు.

ఈ స్థాయి విడుదల కేవలం రాజమౌళి సినిమా కే దక్కతుందని అంతా భావించారు.కాని అనూహ్యంగా రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాకు దక్కింది అంటూ అభిమానలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రికార్డ్‌ స్థాయి లో సర్కారు వారి పాట సినిమా అక్కడ లొకేషన్స్‌ లో విడుదల కాబోతున్న నేపథ్యంలో నాన్‌ రాజమౌళి రికార్డును నమోదు చేయడం ఖాయం అంటున్నారు.

ఆల్‌ టైమ్‌ రికార్డు లను బ్రేక్‌ చేస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డు లను మహేష్ బాబు ఓవర్సీస్ లో నిలుపుతూనే ఉంటాడు.

సర్కారు వారి పాట సినిమా తో మూడు లేదా నాలుగు మిలియన్ ల వసూళ్ల టార్గెట్ తో రంగంలోకి దిగబోతున్నాడు.అంత భారీ మొత్తం కేవలం రాజమౌళి సినిమాలకు మాత్రమే సాధ్యం అంటారు.

కాని ఇప్పుడు మహేష్‌ బాబు సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాకు కూడా సాద్యమే అంటున్నారు.కీర్తి సురేష్‌ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించాడు.

ట్రైలర్‌ ను చూస్తుంటే ఒక దూకుడు ఒక పోకిరి సినిమా చూస్తున్నట్లుగా ఉందంటూ అభిమానులు అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సినిమా కూడా అలాగే ఉంటుందా అనేది చూడాలి.మే 12న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.11 న యూఎస్ లో ప్రీమియర్ షో లు పడబోతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube