సర్కారు వారి పాట నుండి శివరాత్రికి వస్తున్నది ఏంటీ?

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సర్కారు వారి పాట సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది.

 Mahesh Babu Keerthi Suresh Movie Sarkaaru Vaari Pata Movie Maha Shivaratri Special-TeluguStop.com

కనుక ఇప్పట్లో నే సినిమా నుండి అప్ డేట్‌ కాని పోస్టర్ లేదా టీజర్‌ ను విడుదల చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.ఇలాంటి నేపథ్యంలో మహా శివరాత్రి సందర్బంగా సర్కారు వారి పాట నుండి ఒక ప్రత్యేకమైన పోస్టర్ ను చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటి వరకు రెండు పోస్టర్ లు అయితే వచ్చాయి.కాని ఏ ఒక్క దాంట్లో కూడా మహేష్‌ బాబు లుక్‌ ను రివీల్‌ చేయలేదు.

 Mahesh Babu Keerthi Suresh Movie Sarkaaru Vaari Pata Movie Maha Shivaratri Special-సర్కారు వారి పాట నుండి శివరాత్రికి వస్తున్నది ఏంటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కనుక శివ రాత్రి సందర్బంగా విడుదల కాబోతున్న పోస్టర్ లో లుక్‌ పై క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.పెద్ద ఎత్తున మహేష్‌ బాబుతో పరశురామ్‌ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు.

భారీ బడ్జెట్‌ తో ఈ సినిమా నిర్మాణం జరుగుతోంది.

సినిమా ప్రమోషన్ విషయమై మైత్రి మరియు 14 రీల్స్ వారికి ప్రత్యేకమైన శైలి ఉంది.

వారు ఏ ఒక్క చిన్న సందర్బాన్ని కూడా వదలకుండా ఏదో ఒక అప్‌ డేట్ ఇస్తూనే ఉంటారు.మహా శివరాత్రి వంటి బిగ్‌ ఫెస్టివల్‌ కు వారు అప్‌ డేట్ ఇవ్వకుండా ఎలా ఉంటారు చెప్పండి.

అందుకే ఈ సినిమా అప్ డేట్ ను దర్శకుడు శివ రాత్రికి ఇవ్వాలని ఏర్పాట్లు చేస్తున్నాడట.ఈ సినిమా లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.

ఇప్పటి వరకు ఆమె కు సంబంధించిన అప్ డేట్‌ కూడా రాలేదు.కనుక ఆమె లుక్ లేదా ఆమె క్యారెక్టర్‌ కు సంబంధించిన ఏదైనా హింట్ ను ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

#MahaShiva #Mahesh Babu #MaheshBabu #Keerthi Suresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు