హీరో మహేష్ చెబితే చప్పట్లు.. సీఎం జగన్ చేస్తే విమర్శలా..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల క్రితం రాష్ట్రంలో వాహనదారుల మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫైన్లు విధించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.వాహనం ఏదైనా ఒకే తరహా ఫైన్లు విధించడంతో పాటు వందల రూపాయల జరిమానాలను వేల రూపాయలకు పెంచారు.

 Ycp Minister Perni Nani Reaction About Huge Traffic Fines  Mahesh Babu, Jagan Mo-TeluguStop.com

పర్మిట్ లేని వాహనాలకు పది వేల రూపాయలు, ఓవర్ లోడ్ తో వెళ్లే వాహనాలకు 20 వేల రూపాయలు. బండికి సంబంధించిన సర్టిఫికెట్లు లేకుండా తొలిసారి పట్టుబడితే రూ.2వేలు, రెండోసారి పట్టుబడితే రూ.5 వేలు ఫైన్ విధించాలని నిర్ణయించారు.

సీఎం నిర్ణయం విన్న తరువాత రాష్ట్ర ప్రజలందరికీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా గుర్తుకు వచ్చింది.ఆ సినిమాలో మహేష్ బాబు వాహనదారులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.

ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.కొందరు నెటిజన్లు సినిమాలో మహేష్ బాబు భారీ ఫైన్ల గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

అయితే జగన్ నిర్ణయంపై వాహనదారుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Telugu @perni_nani, Ap, Mahesh Babu, Perni Nani, Trafic, Ycp Perni Nani, Ysrcp-P

ప్రజలతో ఫైన్ల రూపంలో భారం మోపడం సరికాదని కొందరు ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారు.అయితే వైసీపీ మంత్రి పేర్ని నాని ప్రజల నుంచి, వాహనదారుల నుంచి వ్యక్తమవుతున్న విమర్శల గురించి స్పందించారు.సీఎం జగన్ భరత్ అనే నేను సినిమాలోలానే ప్రజలపై జరిమానాలు విధిస్తున్నాడని మహేష్ బాబు చెబితే చప్పట్లు కొట్టి జగన్ చెబితే విమర్శలు చేస్తున్నారా.? అని ప్రశ్నించారు.ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనే జరిమానాలను పెంచామని తెలిపారు.

కుటుంబాల సంక్షేమమే దృష్టిలో ఉంచుకుని వాహనదారులపై జరిమానాలు విధించామని.కేంద్రం మోటార్ వెహికిల్ యాక్ట్ లో చేసిన సవరణలను అనుగుణంగానే ట్రాఫిక్ జరిమానాలు అమలవుతున్నాయని ప్రజల్లో ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత లేకపోయినా కొన్ని పార్టీలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు చేస్తున్నాయని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube