నువ్వు దేవుడివి సామి : మహేష్‌ రీల్‌ మహర్షి అయితే ఇతడు రియల్‌ మహర్షి... ఎందుకో తెలిస్తే సెల్యూట్‌ చేస్తారు  

Mahesh Babu Is Reel Maharshi But This Man Was A Real Maharshi-maharshi Movie Effect In America,mahesh Babu,real Maharshi,telugu Viral News,viral In Social Media,రియల్‌ మహర్షి

ఇటీవలే ప్రేక్షకుల ముందుకు మహర్షి చిత్రం వచ్చింది. ఆ చిత్రంలో హీరో రిషి తన వేల కోట్ల ఆస్తి నుండి 90 శాతంను రైతుల సంక్షేమ నిధికి విరాళంగా ఇస్తున్నట్లుగా ప్రకటించడం మనం చూశాం. రైతుల కోసం రిషి చేసిన పనికి అతడిని దేశ వ్యాప్తంగా యూత్‌ ఆదర్శంగా తీసుకోవడంతో పాటు ప్రముఖ వ్యాపార సంస్థలు, స్వచ్చంద సంస్థలు కూడా ముందుకు వచ్చి రైతులకు సాయం చేసేందుకు సిద్దం అయినట్లుగా సినిమాలో చూపించారు. ఇక అంతకు ముందు శ్రీమంతుడు సినిమాలో కూడా మహేష్‌ బాబు వేల కోట్ల ఆస్తులను వదిలేసి గ్రామంలో ఉండేందుకు సిద్ద పడతాడు..

నువ్వు దేవుడివి సామి : మహేష్‌ రీల్‌ మహర్షి అయితే ఇతడు రియల్‌ మహర్షి... ఎందుకో తెలిస్తే సెల్యూట్‌ చేస్తారు-Mahesh Babu Is Reel Maharshi But This Man Was A Real Maharshi

ఇలాంటివి కేవలం సినిమాల్లోనే జరుగుతాయి, నిజ జీవితంలో అసలు అలా జరగవు అని అంతా అనుకుంటారు. కాని నిజ జీవితంలో కూడా అలా జరిగింది.

రిషి వేల కోట్ల రూపాయలను ఇచ్చినట్లుగా మహర్షి చిత్రంలో చూపించారు. అయితే నిజ జీవితంలో కనీసం కోటి రూపాయలు ఇచ్చినా కూడా చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు.

అలాంటిది అమెరికాకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త పేద విద్యార్థుల కోసం ఏకంగా దాదాపుగా 250 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. తాజాగా ఈయన అమెరికాలోని ప్రముఖ యూనివర్శిటీ అయిన అట్లాంటా బ్లాక్‌ మోర్‌ హౌస్‌లో విద్యార్థుల కాన్వగేషన్‌ కార్యక్రమంలో వ్యాపారవేత్త రాబర్ట్‌ ఎఫ్‌ స్మిత్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన సంచలన ప్రకటన చేశారు..

అమెరికాలో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకునేందుకు డబ్బు లేక పోవడంతో బ్యాంకు లోన్లు తీసుకుంటూ ఉంటారు. ఆ లోన్లను కొందరు కట్టలేక నానా ఇబ్బందులు పడుతూ చదువును మద్యలోనే వదిలేస్తున్నారు.

దాంతో రాబర్ట్‌ తాజాగా అలాంటి విద్యార్థుల కోసం 250 కోట్ల రూపాయలను బ్యాంకులకు తాను తన కుటుంబ సభ్యులు ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు. ఇంతటి భారీ సాయంను ఇప్పటి వరకు అమెరికాలోని విద్యార్థులకు ఎవరు చేయలేదని అంటున్నారు. ఇతడు చేసిన గొప్ప సాయంకు విద్యార్థులు ఆయన్ను దేవుడిగా భావిస్తున్నారు.