వామ్మో... మహేష్ బాబు కోసం ఆ కూల్ డ్రింక్స్ సంస్థ కోట్ల రూపాయలు పెడుతోందట....

Mahesh Babu Is Brand Ambassador To The Mountain Dew Soft Drink

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీ హోదా లో కొనసాగుతున్న నటీనటులకు ఫేమ్ మరియు క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకు కోవాలని లేకపోతే ఫేమ్ మరియు క్రేజ్ తగ్గిపోయిన తర్వాత అవకాశాలతో పాటు ఆర్థికంగా కూడా సమస్యలు ఎదురవుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఇది గమనించిన కొందరు సినీ సెలబ్రెటీ లు  ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క పలు వాణిజ్య సంస్థల ప్రకటనల్లో కూడా నటిస్తూ జనాల్లో తమకు ఉన్నటువంటి ఫేమ్ మరియు క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్నారు.

 Mahesh Babu Is Brand Ambassador To The Mountain Dew Soft Drink-TeluguStop.com

ఇంకొందరైతే ఏకంగా సినిమాల్లో నటించడంతో పాటు ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతూ వ్యాపారాల్లో కూడా బాగానే రాణిస్తున్నారు.

కాగా తెలుగు ప్రముఖ హీరో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఇదే దోవలో పయనిస్తున్నాడు.

 Mahesh Babu Is Brand Ambassador To The Mountain Dew Soft Drink-వామ్మో… మహేష్ బాబు కోసం ఆ కూల్ డ్రింక్స్ సంస్థ కోట్ల రూపాయలు పెడుతోందట….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో ఒక పక్క సినిమాలు మరో పక్క ప్రకటనలు అలాగే వ్యాపారాలు అంటూ బిజీగా గడుపుతున్నాడు.తాజాగా హీరో మహేష్ బాబు మౌంటెన్ డ్యూ కూల్ డ్రింక్ ని ప్రమోట్ చేసేందుకు ఓ యాడ్ లో నటించాడు.

అయితే ఈ యాడ్ లో నటించడం కోసం మహేష్ బాబు దాదాపుగా కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.అయితే గతంలో కూడా మహేష్ బాబు కోకోకోలా సంస్థలకు చెందిన థమ్సప్ కూల్ డ్రింక్ ని కూడా ప్రమోట్  చేశాడు.

దీంతో కోకాకోలా సంస్థ మహేష్ బాబుకి దాదాపుగా రెండు కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ ముట్టజెప్పినట్లు సమాచారం.అయితే మహేష్ బాబు ప్రముఖ ద్విచక్ర వాహన ఉత్పత్తిదారుల సంస్థ అయిన టీవీఎస్ వాహనాలను కూడా ప్రమోట్ చేస్తున్నాడు.

దీన్ని బట్టి చూస్తే మహేష్ బాబు కి సినిమాల పరంగా మాత్రమే కాకుండా ఏడాదికి కేవలం ప్రకటనల్లో నటించడం వల్లే దాదాపుగా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu Mahesh Babu, Maheshbabu, Mountain Dew, Telugu, Tollywood-Movie

ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యింది.అంతేగాక కొన్ని ఏరియాలలో పలు నాన్ బాహుబలి రికార్డులను కూడా బద్దలు కొట్టింది.దీంతో మహేష్ బాబు ఒక్కో సినిమాకి దాదాపుగా 50 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

అయితే ప్రస్తుతం మహేష్ బాబు తెలుగు లో సర్కారు వారి పాట అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుండగా ప్రముఖ దర్శకుడు పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

కాగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా సంగీత దర్శకుడు తమన్ సంగీతం అందిస్తున్నాడు.అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు భావించినప్పటికీ పలు అనివార్య కారణాల వల్ల వేసవి కాలంలో విడుదల చేస్తున్నట్లు ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు.

#Mountain Dew #MaheshBabu #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube