మళ్లీ విజయ్‌ దేవరకొండను పిలిచిన మహేష్‌.. అతడిపై అంత శ్రద్ద ఏంటో?  

Mahesh Babu Invites Vijay Devarakonda For Family Party-mahesh Babu,vijay Devarakonda,ప్రీ రిలీజ్‌,మహేష్‌ బాబు

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తన సినిమాలకు ప్రత్యేక గెస్ట్‌లుగా ఎవరిని పిలుచుకోడు. చాలా అరుదగా మాత్రమే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. ఇతర హీరోల వేడుకలకు హాజరు అయ్యే మహేష్‌ బాబు తన సినిమా వేడుకలకు మాత్రం చాలా అరుదుగా స్టార్స్‌ను ఆహ్వానిస్తాడు...

మళ్లీ విజయ్‌ దేవరకొండను పిలిచిన మహేష్‌.. అతడిపై అంత శ్రద్ద ఏంటో?-Mahesh Babu Invites Vijay Devarakonda For Family Party

తాజాగా మహర్షి ప్రీ రిలీజ్‌ వేడుక సందర్బంగా వెంకటేష్‌ మరియు విజయ్‌ దేవరకొండను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. వెంకటేష్‌ అయితే గతంలో తనతో నటించాడు కనుక పిలిచాడని భావించవచ్చు. అయితే విజయ్‌ దేవరకొండను ఎందుకు పిలిచాడనేది అప్పుడు కొందరు వ్యక్తం చేసిన అనుమానం.

విజయ్‌ దేవరకొండను ప్రీ రిలీజ్‌ వేడుకకు ఆహ్వానించడంతో పాటు, మహేష్‌ బాబు మాట్లాడుతూ రౌడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక వీరిద్దరు మద్య స్నేహం మరో అడుగు ముందుకు పండింది. మహర్షి విడుదలై ప్రత్యేక షోను వేయడం జరిగింది.

ఆ షోలో చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. అయితే దీనికి విజయ్‌ దేవరకొండ హాజరు అవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. మహేష్‌ బాబు తన ఇంట్లో ఇచ్చిన పార్టీకి విజయ్‌ దేవరకొండను ఆహ్వానించడంపై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి.

మహేష్‌కు ఎందుకు ఇంతగా విజయ్‌ దేవరకొండపై ఆసక్తి కలుగుతోంది. గతంలో ఏ యంగ్‌ హీరో పట్ల కూడా ఇంతటి ఆసక్తి, అభిమానంను మహేష్‌బాబు వ్యక్తం చేయలేదు. కాని ఈసారి మాత్రం విజయ్‌ దేవరకొండపై ఎందుకు ఇంతగా మహేష్‌బాబు ఇంట్రస్ట్‌ చూపుతున్నాడు అంటూ అభిమానులు ఆలోచనల్లో మునిగి పోయారు. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ మరియు మహేష్‌ బాబులు విడి విడిగా సినిమాలు చేస్తున్నారు.

వీరిద్దరి స్నేహం చూస్తుంటే భవిష్యత్తులో వీరిద్దరు మల్టీస్టారర్‌ చేసినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.