మెగాస్టార్ కోసం సూపర్ స్టార్.. మెగాపవర్ స్టార్ ఎత్తుకు జనం ఫిదా!  

Mahesh Babu In Chiranjeevi Movie - Telugu Chiranjeevi, Chiru 152, Koratala Siva, Maehsh Babu, Ram Charan

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన కెరీర్‌లో 152వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాతో మరోసారి మెగాస్టార్ బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడేందుకు రెడీ అవుతున్నాడు.

Mahesh Babu In Chiranjeevi Movie - Telugu Chiru 152 Koratala Siva Maehsh Ram Charan

ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో టాలీవుడ్ సూపర్‌స్టార్‌ను నటింపజేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సూపర్ స్టార్ మహేష్ బాబును నటింపజేయాలని భావిస్తున్నాడు.తనకు మంచి స్నేహితుడైన మహేష్‌ను ఇందుకు సంబంధించిన ఒప్పంచినట్లు తెలుస్తోంది.

కాగా డైరెక్టర్ కొరటాల శివ కూడా మహేష్‌తో మంచి రిలేషన్ మెయింటెయిన్ చేస్తుండటంతో అతడిని ఈ సినిమాలో నటించాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది.

ఒకవేళ మహేష్ ఈ సినిమాలో కేమియో పాత్రలో నటిస్తే మాత్రం ఈ సినిమాకు అదిరిపోయే క్రేజ్ వచ్చి పడుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

మెగాస్టార్ క్రేజ్‌కు కొరటాల టేకింగ్‌ తోడవడంతో పాటు మహేష్ స్పెషల్ ఎంట్రీ కలిసి వస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.మరి ఈ సినిమాలో మహేష్ నటిస్తాడా లేడా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట చిత్ర యూనిట్.

తాజా వార్తలు