చిరు సినిమాకు మహేష్ అంత పుచ్చుకుంటున్నాడా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.స్టార్ ప్రొడ్యూసర్ కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తాడనే వార్త ఇప్పటికే ప్రచారంలో ఉంది.

 Mahesh Babu Huge Remuneration For Chiru152-TeluguStop.com

ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల అంగీకరించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో మహేష్ చేయబోయే పాత్ర కేవలం కేమియో తరహా పాత్ర కాదని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం మహేష్ ఏకంగా 30 రోజుల డేట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా కోసం మహేష్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ కూడా ప్రస్తుతం టాలీవుడ్ హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సినిమా కోసం రోజుకు రూ.కోటి డిమాండ్ చేస్తున్న మహేష్ 30 రోజుల్లో రూ.30 కోట్లు వెనకేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.

అటు మహేష్‌కు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తోందని తెలుస్తోంది.

కొరటాల డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్‌పై నిర్మి్స్తున్నారు.అందాల భామ త్రిష ఈ సినిమాలో చిరుతో రొమాన్స్ చేయనుంది.

మరి ఈ సినిమాలో మహేష్ చేయబోయే పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube