అంత పెద్ద పని చేసి ఎవరికి తెలియకుండా దాచిన మహేష్‌ బాబు.. బయటకు తెలియడంతో నోరెళ్లబెట్టిన ఫ్యాన్స్‌  

Mahesh Babu Helps 100 People In Secretly-

పావలా పని చేసి రూపాయి పబ్లిసిటీ చేసుకునే వారు మన చుట్టు ఎంతో మంది ఉంటారు.వంద రూపాయల సాయం చేసి వెయ్యి రూపాలు చేసినట్లుగా ప్రచారం చేసుకునే వారు కూడా మన చుట్టు ఎంతో మంది ఉంటారు.కాని కోట్ల రూపాయల సాయం చేసి ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు...

Mahesh Babu Helps 100 People In Secretly--Mahesh Babu Helps 100 People In Secretly-

ఆయన చేసిన పని తెలిసి తాజాగా జనాలు అంతా అవాక్కవుతున్నారు.ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వెయ్యి మంది చిన్నారులకు మహేష్‌ సాయం చేశాడట.

Mahesh Babu Helps 100 People In Secretly--Mahesh Babu Helps 100 People In Secretly-

పూర్తి వివరాల్లోకి వెళ్తే… మహేష్‌ బాబు మూడు సంవత్సరాలుగా ఒక హాస్పిటల్‌తో కలిసి వెయ్యి మంది చిన్నారుల గుండె ఆపరేషన్‌కు సాయం చేశాడట.హాస్పిటల్‌తో ఒప్పందం చేసుకున్న మహేష్‌ బాబు పిల్లల గుండె ఆపరేషన్‌ ఫ్రీగా చేయించాడని తెలుస్తోంది.

వెయ్యి మంది పిల్లలకు ఆపరేషన్‌ చేయించినా కూడా ఇప్పటి వరకు ఈ విషయం బయటకు రాలేదు.పబ్లిసిటీ ఆసక్తి లేని మహేష్‌ బాబు ఈ విషయాన్ని బయటకు చెప్పి తాను గొప్పవాడిగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకోవడం లేదు..

ఈ విషయం తాజాగా ఆ నోట ఈనోటా పడి బయటకు వచ్చింది.

మహేష్‌ బాబు సన్నిహితులు కూడా ఈ విషయాన్ని నిర్థారించారు.మహేష్‌ బాబుకు ఈ విషయం ఇష్టం లేదు.సాయం చేసిన విషయం బయటకు రావడం ఇష్టం లేదు కనుకే మూడు సంవత్సరాలుగా చెప్పకుండా దాచాం.

ఇప్పుడు ఎలా బయటకు వచ్చిందో తెలియదు కాని బయటకు వచ్చిందని వారు అంటున్నారు.ప్రస్తుతం మహేష్‌ బాబు తన 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు లో నటిస్తున్న విషయం తెల్సిందే.