మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం మూవీ( Guntur Kaaram ) ఈ ఏడాది థియేటర్లలో విడుదలై యావరేజ్ గా నిలిచింది.అయితే ఉగాది పండుగ( Ugadi Festival ) కానుకగా ఈ సినిమా బుల్లితెరపై జెమిని ఛానల్ లో ప్రసారమైంది.
అయితే ఈ సినిమాకు బుల్లితెరపై అదుర్స్ అనేలా రెస్పాన్స్ వచ్చింది.గుంటూరు కారం సినిమాకు ఏకంగా 9.23 టీఆర్పీ వచ్చింది.ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత మంచి రేటింగ్ రావడం అంటే గ్రేట్ అనే చెప్పాలి.
గుంటూరు కారం సినిమాను ఉగాది పండుగకు సరిగ్గా రెండు రోజుల ముందు ప్రసారం చేయడం ఈ సినిమాకు కలిసొచ్చిందని చెప్పవచ్చు.మహేష్ బాబు( Mahesh Babu ) గత సినిమాలతో పోల్చి చూస్తే ఈ రేటింగ్ తక్కువే అయినా బుల్లితెరపై ఎంత పెద్ద సినిమాకు అయినా మంచి రేటింగ్ రావడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో గుంటూరు కారం మూవీ చెప్పుకోదగ్గ స్థాయిలోనే రేటింగ్ ను సొంతం చేసుకుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
గుంటూరు కారం భవిష్యత్తులో మళ్లీ బుల్లితెరపై ప్రసారమైన సమయంలో మరింత బెటర్ రేటింగ్స్( Guntur Kaaram TRP Ratins ) సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.మహేష్ బాబు రాజమౌళి కాంబో మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకోవడానికి 3 నుంచి 4 సంవత్సరాల సమయం పడుతుందని చెప్పవచ్చు.అప్పటివరకు మహేష్ బాబు అభిమానులకు గుంటూరు కారం సినిమా మాత్రమే ఆప్షన్ అవుతుంది.
రాజమౌళి( Rajamouli ) సినిమాకు ఎక్కువ సమయం పట్టినా ఆ ఎదురుచూపులకు తగ్గ ఫలితం దక్కే అవకాశం ఉండటంతో అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.రాజమౌళి త్వరలో ఈ సినిమా టైటిల్ ను ప్రకటించడంతో పాటు కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేయనున్నారని సమాచారం అందుతోంది.మహేష్ బాబు గుంటూరు కారం సినిమా మాత్రం తమను తీవ్రస్థాయిలో నిరాశపరిచిందని నెటిజన్లు చెబుతున్నారు.