భీష్మ దర్శకుడుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూపర్ స్టార్  

Mahesh Babu Green Signal To Bhishma Director Story - Telugu, Super Star, Telugu Cinema, Tollywood, Venky Kudumula

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.ఓ వైపు మంచి కమర్షియల్ మెసేజ్ కథలని చూసుకొని వాటితో ప్రేక్షకుల ముందుకి వస్తూ, అదే సమయంలో మధ్య మధ్యలో కాస్తా ఎంటర్టైన్మెంట్ తో కామెడీ పండించే సినిమాలు చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

 Mahesh Babu Green Signal To Bhishma Director Story

ఏడాదికి ఒక రెండు సినిమాలు ప్లాన్ చేసుకుంటూ హిట్ మీద హిట్ కొడుతూ దూసుకుపోతున్నాడు.సక్సెస్ ఫుల్ దర్శకులు చెప్పే కథలు వింటూ అందులో బెస్ట్ అనిపించేవి ఒకే చేస్తూ వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు.

ఇప్పుడు మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.దీంతో పాటు లైన్ లో సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి ఉన్నారు.

భీష్మ దర్శకుడుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూపర్ స్టార్-Movie-Telugu Tollywood Photo Image

వీటితో పాటు రాజమౌళి దర్శకత్వంలో మూవీ ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.ఇప్పుడు మహేష్ బాబు లైన్ లోకి మరో హిట్ దర్శకుడు వచ్చి చేరాడు.చలో, భీష్మ సినిమాలతో వరుసగా రెండు హిట్స్ కొట్టిన దర్శకుడు వెంకి కుడుముల చెప్పిన ఓ ఎంటర్టైన్మెంట్ కథకి మహేష్ బాబు ఒకే చెప్పాడని, ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని సూచించినట్లు టాక్ వినిపిస్తుంది.వెంకి మొదటి, రెండు సినిమాలు కామెడీ ఎంటర్టైన్మెంట్ కథలతో ప్రేక్షకులని కట్టిపడేసాడు.

అలాంటే కథతోనే మహేష్ బాబుని కూడా మెప్పించినట్లు సమాచారం.అయితే మహేష్ బాబు లిస్టు లో వరుసగా ఇంత మంది దర్శకులు లైన్ గా ఉండటంతో వెంకి సినిమా ఎప్పటికి పట్టాలు ఎక్కుతుందో అనేది క్లారిటీ లేదు.

అయితే దీనిపైన అఫీషియల్ గా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Green Signal To Bhishma Director Story Related Telugu News,Photos/Pics,Images..

footer-test