రూ.15 కోట్లు... సౌత్‌ లో మహేష్‌ నెం.1 అనేందుకు ఇదే సాక్ష్యం

Mahesh Babu For Ambassador For Mountain Dewin

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బ్రాండ్ వ్యాల్యూ చాలా ఎక్కువ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆయన ప్రతి ఏడాది సినిమా ల ద్వారా సంపాదించే మొత్తంకు ఏమాత్రం తగ్గకుండా బ్రాండ్‌ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ కూడా ఆదాయం దక్కించుకుంటున్నాడు.

 Mahesh Babu For Ambassador For Mountain Dewin-TeluguStop.com

ప్రతి ఒక్క యాడ్‌ కు కోట్లల్లో పారితోషికం తీసుకునే మహేష్‌ బాబు గతంలో థమ్స్ అప్‌ కు బ్రాండ్‌ అంబాసిడర్ గా వ్యవహరించిన విషయం తెల్సిందే.ఇప్పుడు అదే కోకకోల కంపెనీకి చెందిన మౌంటెన్‌ డ్యూ కు మహేష్ బాబు కొత్తగా బ్రాండ్‌ అంబాసిడర్ గా ఎంపిక అయ్యాడు.

ఉత్తరాదిన హృతిక్ రోషన్‌ తో ఈ సంస్థ ప్రచారం చేయిస్తుంది.సౌత్‌ లోని అన్ని భాషలకు కూడా మహేష్ బాబును తమ బ్రాండ్‌ అంబాసిడర్ గా మౌంటెన్ డ్యూ ఎంపిక చేయడం జరిగిందట.

 Mahesh Babu For Ambassador For Mountain Dewin-రూ.15 కోట్లు… సౌత్‌ లో మహేష్‌ నెం.1 అనేందుకు ఇదే సాక్ష్యం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందుకు గాను మహేష్‌ బాబుతో ఒక సంవత్సరంకు ఒప్పందం చేసుకుని ఏకంగా 15 కోట్లు మరియు షూటింగ్‌ సమయంలో అదనపు చార్జీలు చెల్లించేందుకు ఒప్పుకుందట.

Telugu Actorsonbrands, Mahesh Babu, Mountain Dewin-Movie

ఇంత భారీ మొత్తంలో సౌత్‌ హీరో కూడా అంబాసిడర్‌ గా చేసినందుకు తీసుకోవడం లేదు.ఏడాదికి ఇంత భారీ మొత్తంను ఇక పై అన్ని బ్రాండ్స్ కు కూడా తీసుకుంటానని మహేష్ బాబు చెబుతున్నాడట.బడా కంపెనీ అవ్వడంతో మహేష్‌ బాబు డిమాండ్ కు ఓకే చెప్పడం జరిగింది.

మరి ముందు ముందు ఇతర సంస్థలు కూడా మహేష్ బాబుకు ఓకే చెప్తే మాత్రం ఖచ్చితంగా ఆయన సినిమాల కంటే డబుల్‌ బ్రాండ్స్ ద్వారా సంపాదించ వచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట ప్రస్తుతం మహేష్ బాబు మౌంటెన్‌ డ్యూ కు సంబంధించిన పోస్టర్ మరియు ఈ కొత్త ఒప్పందం గురించిన చర్చ జరుగుతోంది.

ఇక మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రీకరణలో పాల్గొంటున్నాడు.ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమాను మహేష్‌ బాబు చేయబోతున్నాడు.

#Actorsonbrands #Mountain DewIn #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube