మహేష్‌పై అక్కడ ఎవరో కక్ష సాధిస్తున్నారు  

ప్రస్తుతం అన్ని భాషల హీరోలు కూడా ఇతర భాషల్లో కూడా తమ సినిమాలు ఆడాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా సౌత్‌ హీరోలు ఈ భాషలో నటించి ఆ భాషలో ఆడాలని, ఆ భాషలో నటించి ఈ భాషలో ఆడాని కోరుకుంటున్నారు. కొందరు తెలుగు చిన్న హీరోలు కూడా తమిళం మరియు మలయాళంలో మంచి గుర్తింపును దక్కించుకున్నాఉ. కాని మహేష్‌బాబు మాత్రం తెలుగులో తప్ప ఇప్పటి వరకు ఏ ఇతర భాషలో కూడా సత్తా చాటలేక పోయాడు.

Mahesh Babu Flop Movies Re-released At Tamilnadu-

Mahesh Babu Flop Movies Re-released At Tamilnadu

తమిళంలో మంచి మార్కెట్‌ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న మహేష్‌బాబు ‘స్పైడర్‌’ చిత్రంతో వారి ముందుకు వెళ్లాడు. ఆ చిత్రం కాస్త అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. స్పైడర్‌ విడుదలై మహేష్‌బాబుకు మంచి పేరు వస్తే ఆయన నటించిన గత చిత్రాలు కూడా తమిళంలో విడుదల చేయాలని డిస్ట్రిబ్యూటర్లు కొందరు ఎదురు చూస్తున్నారు. అయితే స్పైడర్‌ విడుదలై ఫ్లాప్‌ అవ్వడంతో మహేష్‌ సినిమాలు తమిళంలో ఆడవని ఫిక్స్‌ అయ్యారు. అందుకే అక్కడ మహేష్‌ సినిమా విడుదల విషయాన్ని వెనక్కు తీసుకున్నారు.

కాని ఈమద్య మహేష్‌బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ మరియు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాలు తమిళంలో డబ్‌ అయ్యి, విడుదలకు సిద్దం అవుతున్నాయి. మహేష్‌ బాబు స్థాయిని అక్కడ మరింత తగ్గించేందుకు ఎవరో కావాలని ఇలా చేస్తున్నారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో ఫ్లాప్‌ అయిన ఆ చిత్రాలు తమిళంలో ఎలా ఆడతాయని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Mahesh Babu Flop Movies Re-released At Tamilnadu-

తెలుగులో ఆడని చిత్రాలను తమిళంలో విడుదల చేయాలనుకోవడం అనేది ఖచ్చితంగా మహేష్‌పై కక్షతోనే ఎవరో కావాలని చేస్తున్నారు అంటూ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తమిళనాట మహేష్‌బాబు స్థాయిని తగ్గించాలని ఎవరు అనుకుంటున్నారు, ఎవరికి ఆ అవసరం ఉంది అంటూ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. త్వరలో విడుదల కాబోతున్న ఆ రెండు చిత్రాలు ఖచ్చితంగా ఫ్లాప్‌ అవ్వడం మహేష్‌బాబు పరువు పోవడం జరుగుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.