దేశ సరిహద్దుల్లో యుద్దం ముగించిన మహేష్‌ అండ్‌ టీం  

Mahesh Babu First Schedule Complete-

మహేష్‌ బాబు తన 25వ చిత్రం ‘మహర్షి’తో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే.రికార్డు స్థాయిలో ఆ చిత్రం వసూళ్లు సాధించింది.అద్బుతమైన రికార్డులను నమోదు చేసిన మహర్షి చిత్రం తర్వాత మహేష్‌బాబు చేస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.ఈ చిత్రం షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది.మొన్నటి వరకు జమ్మూ కాశ్మీర్‌లో చిత్రీకరణ జరిపిన చిత్ర యూనిట్‌ సభ్యులు హైదరాబాద్‌ చేరుకున్నారు...

Mahesh Babu First Schedule Complete--Mahesh Babu First Schedule Complete-

ఈ విషయాన్ని దర్శకుడు అనీల్‌ రావిపూడి చెప్పుకొచ్చాడు.

Mahesh Babu First Schedule Complete--Mahesh Babu First Schedule Complete-

ట్విట్టర్‌లో అనీల్‌ రావిపూడి మహేష్‌బాబు ఫొటోను షేర్‌ చేసి మొదటి షెడ్యూల్‌ కాశ్మీర్‌లో పూర్తి చేయడం జరిగిందని ప్రకటించాడు.మొదటి షెడ్యూల్‌ చాలా అద్బుతంగా జరిగింది.మహేష్‌ బాబు గారితో వర్క్‌ ఎక్స్‌పీరియస్స్‌ సూపర్బ్‌ అంటూ పేర్కొన్నాడు.

రెండవ షెడ్యూల్‌ ఈనెల 26 నుండి హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నాం.ఆ షెడ్యూల్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా అనీల్‌ రావిపూడి ట్విట్టర్‌లో పేర్కొన్నాడు..

ఎఫ్‌ 2 వంటి బ్లాక్‌ బస్టర్‌ను అందుకున్న దర్శకుడు అనీల్‌ రావిపూడి ప్రస్తుతం మహేష్‌బాబుతో ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించేందుకు సిద్దం అయ్యాడు.ఇప్పటి వరకు అనీల్‌ రావిపూడి చేసిన సినిమాలు అన్ని కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.అందుకే ఈ చిత్రం కూడా తప్పకుండా విజయం సాధిస్తుందని అంతా నమ్ముతున్నారు.

ఇక ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న కారణంగా సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.