కొరటాలపై మహేష్‌ కోపం వార్తలపై క్లారిటీ

సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు సర్కారు వారి పాట సినిమా ను ఏప్రిల్‌ 1 న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.సంక్రాంతికే రావాల్సి ఉన్నా కూడా రాధే శ్యామ్‌ మరియు ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా లు సంక్రాంతికి వస్తామంటూ ప్రకటించడంతో మంచి ఉద్దేశ్యంతో సంక్రాంతి బరి నుండి సర్కారు వారి పాట తప్పుకున్న విషయం తెల్సిందే.

 Mahesh Babu Fire On Koratala Shiva News Just Rumors Only , Acharya , Koratala Shiva, Mahesh Babu, Movie News, Sarkaru Vaari Pata-TeluguStop.com

పెద్ద ఎత్తున అంచనాలు ఉన్న సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ పూర్తి కావస్తుంది.కనుక సినిమాను ఖచ్చితంగా ఇటీవల ప్రకటించినట్లుగా ఏప్రిల్‌ 1వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా అంతా భావించారు.

కరోనా థర్డ్‌ వేవ్‌ ఏప్రిల్‌ 1 వరకు ముగిసే అవకాశం ఉంది.కనుక ఏప్రిల్‌ 1 న సర్కారు వారి పాట విడుదల మంచి నిర్ణయం అన్నట్లుగా అంతా అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాని ఇప్పుడు ఏప్రిల్‌ 1వ తారీకున ఆచార్య సినిమా ను ఏప్రిల్‌ 1 న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.దర్శకుడు కొరటాల శివ ఏప్రిల్‌ 1న ఆచార్య ను విడుదల చేసేందుకు సిద్దం చేయడం చర్చనీయాంశం అయ్యింది.

తాను వద్దామనుకున్న ఏప్రిల్‌ 1 వ తారీకును ఆచార్య హైజాక్ చేయడం పై మహేష్ బాబు ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Telugu Acharya, Koratala Shiva, Mahesh Babu-Movie

మహేష్‌ బాబు ఈ విషయంలో దర్శకుడు కొరటాల శివపై చాలా కోపంగా ఉన్నాడని అంటున్నారు.తాము ఇప్పటికే ప్లాన్ చేసుకున్న ఏప్రిల్‌ 1వ తారీకున ఆచార్యను దించడం అంటే ఖచ్చితంగా గిల్లడమే అని.ఇందుకు ప్రతీకారం ఉంటుందని మహేష్ బాబు నుండి కొరటాలకు వార్నింగ్‌ వచ్చిందనే పుకార్లు షికార్లు చేశాయి.కాని అసలు విషయం ఏంటీ అంటే మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్‌ ఆలస్య అవుతున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 1వ తారీకున విడుదల అసాధ్యం అనే ఉద్దేశ్యంతో వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించకున్నా కూడా ఆచార్య మేకర్స్ ఆ విషయాన్ని గురించి చర్చించిన తర్వాతే ఏప్రిల్‌ 1వ తారీకున విడుదల చేసేందుకు గాను సిద్దం అయ్యారని తెలుస్తోంది.

కొరటాలకు మరియు మహేష్ బాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.కనుక మహేష్ బాబు సినిమా కు పోటీగా ఆచార్యను విడుదల చేసేంతటి మూర్ఖుడు కొరటాల కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కొరటాల శివ  మరియు చిరంజీవి కాంబో ఆచార్య సినిమా ఏప్రిల్‌ 1న రాబోతుండగా.ఆ తర్వాత మహేష్ బాబు సర్కారు వారి పాట వచ్చే అవకాశాలు ఉన్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube