ఆకాశమే నీహద్దురా దర్శకురాలికి మహేష్‌ ఓకే చెప్పాడు.. సినిమా ఎప్పుడంటే!

తెలుగు దర్శకురాలు సుధ కొంగరకు టాలీవుడ్‌ లో కంటే కోలీవుడ్‌ లోనే మంచి గుర్తింపు దక్కింది.తెలుగు లో ఈమెను ఇన్నాళ్లు పట్టించుకోని నిర్మాతలు మరియు హీరోలు ఆకాశమే నీహద్దురా సక్సెస్ తర్వాత ఆఫర్లు ఇస్తాం అంటూ పిలుస్తున్నారు.

 Mahesh Babu Film With Akashame Nee Haddura Movie Director , Sudha Kongara, Mahes-TeluguStop.com

తమిళంలోనే ఎక్కువ గుర్తింపును దక్కించుకున్న ఈమె ప్రస్తుతం అక్కడే ఒక సినిమాను చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది.ఒక రియల్ లైఫ్‌ ఇన్సిడెంట్స్ ను కథను తీసుకుని ఆమె తెరకెక్కించిన తీరు నిజంగా అద్బుతం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆకాశమే నీ హద్దురా అంటూ ఆమె అద్బుతాన్ని ఆవిష్కరించింది.స్టార్‌ హీరోను అతడి ట్యాలెంట్ ను సరిగ్గా ఉపయోగించుకుంది అంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.

అద్బుతమైన ఈ సినిమాను చూసిన పలువురు తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ మరియు హీరోలు ఆమెను అభినందించారు.

సుధ కొంగరతో వర్క్ చేసేందుకు టాలీవుడ్‌ నుండి మొదటగా మహేష్‌ బాబు ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే సుధ కొంగర చెప్పిన కథను మహేష్‌ బాబు ఓకే చెప్పాడట.త్వరలోనే ఇద్దరి కాంబోలో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ను మొదలు పెట్టే అవకాశం లేదు.కాని వీరిద్దరి కాంబో మాత్రం పక్కాగా ఓకే అయ్యిందని అంటున్నారు.ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా ను చేస్తున్న మహేష్‌ బాబు ఆ తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా ను చేసేందుకు కమిట్‌ అయిన విషయం తెల్సిందే.ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వం లో సినిమా ఉంటుందని అంటున్నారు.

ఒక వేళ రాజమౌళి దర్శకత్వం లో సినిమా ఆలస్యం అయితే సుధా కొంగర దర్శకత్వం లో మహేష్‌ బాబు నటిస్తాడని సమాచారం.ఒక వేళ రాజమౌళి సినిమా ఆలస్యం కాకుంటే ఆ తర్వాత సుధా కొంగర దర్శకత్వం లో సినిమా ఉంటుందని అంటున్నారు.

మొత్తానికి సుధా కొంగర దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా కన్ఫర్మ్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube