త్రివిక్రమ్‌ ను సెంటిమెంట్‌ కంటిన్యూ చేయమంటున్న మహేష్‌ ఫ్యాన్స్‌

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వం లో మహేష్‌ బాబు హీరోగా ఇప్పటి కే రెండు సినిమా లు వచ్చాయి.అందులో ఒకటి అతడు కాగా రెండవది ఖలేజా.

 Mahesh Babu Fans Want Sentiment Title For Trivikram Movie-TeluguStop.com

ఈ రెండు సినిమా లు కూడా కమర్షియల్‌ గా సక్సెస్ కాకున్నా చాలా ప్రత్యేకమైన సినిమాలు అంటూ మహేష్‌ బాబు గతంలో చెప్పుకొచ్చాడు.ఆ రెండు సినిమా లు ఇప్పటికి మహేష్‌ బాబు అభిమానులను బుల్లి తెర ద్వారా అలరిస్తూనే ఉన్నాయి.

మహేష్‌ బాబుతో దాదాపు 11 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ సినిమా ను చేసేందుకు సిద్దం అయిన విషయం తెల్సిందే.వీరిద్దరి కాంబో అధికారికంగా ప్రకటన వచ్చింది.

 Mahesh Babu Fans Want Sentiment Title For Trivikram Movie-త్రివిక్రమ్‌ ను సెంటిమెంట్‌ కంటిన్యూ చేయమంటున్న మహేష్‌ ఫ్యాన్స్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మాటల మాంత్రికుడితో మహేష్‌ బాబు చేయబోతున్న సినిమా టైటిల్ కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్‌ డేట్‌ మనకు అందుతోంది. మే 31 ఈ సినిమా కు సంబంధించిన టైటిల్ ను ప్రకటించబోతున్నారు.

కృష్ణ పుట్టిన రోజు అయిన మే 31న ప్రతి ఏడాది మహేష్‌ బాబు సినిమా లకు చెందిన అప్‌ డేట్స్ ఇస్తూనే ఉంటారు.అలాగే త్రివిక్రమ్‌ కూడా ఈసారి తాను మహేష్‌ బాబుతో చేయబోతున్న సినిమా కు సంబంధించిన అప్‌ డేట్‌ ఇవ్వబోతున్నాడట.

ఈ సమయంలో త్రివిక్రమ్‌ ను మహేష్‌ బాబు అభిమానులు ఒకటే రిక్వెస్ట్‌ చేస్తున్నారు.గత కొంత కాలంగా త్రివిక్రమ్‌ ప్రతి సినిమా టైటిల్ కూడా అ అనే అక్షరంతో మొదలు అవుతుంది.

కనుక మహేష్‌ బాబు సినిమా కు కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో చేయాలని కోరుతున్నారు.గతంలో మహేష్‌ బాబుతో త్రివిక్రమ్ తెరకెక్కించిన అతడు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

కనుక అ సెంటిమెంట్ మళ్లీ మహేష్‌ కు సక్సెస్‌ ను ఇస్తుందనే నమ్మకంను ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు.అందుకే సోషల్‌ మీడియా ద్వారా త్రివిక్రమ్‌ కు చాలా మంది విజ్ఞప్తి చేస్తున్నారు.

మరి త్రివిక్రమ్‌ ఎలాంటి టైటిల్‌ ను పెడతాడు అనేది చూడాలి.ఒక వేళ అ అక్షరం తో మొదలు అయ్యేలా టైటిల్‌ ను పెడితే ఏ టైటిల్ ను ఆయన పెడతాడు అనేది చూడాలి.

#SSMB28 #MaheshTrivikram #Mahesh Babu #Trivikram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు