నిర్మాతగా సరే.. నటిగా ఎప్పుడు వస్తారు మేడం?

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు భార్య నమ్రత పెళ్లికి ముందు హిందీ మరియు తెలుగు సినిమా ల్లో నటించిన విషయం తెల్సిందే.ఈమె పెళ్లి మరియు పిల్లల తర్వాత ఈమె మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందని అంతా భావించారు.

 Mahesh Babu Fans Want Namrata Re Entry In Movie-TeluguStop.com

కాని పరిస్థితులు చూస్తుంటే ఆమె నటిగా మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా అసాధ్యం అంటున్నారు.రీ ఎంట్రీ గురించి అభిమానులు ఇంకా కూడా ప్రశ్నిస్తునే ఉన్నారు.

సీనియర్‌ హీరోయిన్స్ సెకండ్‌ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టి ఏదో మాదిరిగా కనిపిస్తూ వస్తున్నారు.కాని నమ్రత విషయంలో మాత్రం అది జరగడం లేదు.

 Mahesh Babu Fans Want Namrata Re Entry In Movie-నిర్మాతగా సరే.. నటిగా ఎప్పుడు వస్తారు మేడం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నమ్రత శిరోద్కర్‌ రీ ఎంట్రీ విషయమై పదే పదే అభిమానులు ప్రశ్నిస్తున్నారు.తాజాగా మరో సారి కొందరు నమ్రత శిరోద్కర్‌ ను నటిగా ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ప్రశ్నించారు.

నిర్మాతగా ఇప్పటికే పలు సినిమాలను నిర్మించిన నమ్రత త్వరలోనే పూర్తి స్థాయి నిర్మాతగా వెండి తెరపై టైటిల్ కార్డు లో కనిపించబోతుంది.

పలు సినిమాలను ఇతర బ్యానర్‌ లతో కలిసి నిర్మించిన నమ్రత మహేష్ లు సొంతంగా సినిమాల నిర్మాణంను మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కొత్త హీరోలు మరియు కొత్త ఫిల్మ్‌ మేకర్స్ తో ఏకంగా నాలుగు సినిమా లను వీరు మీడియం బడ్జెట్‌ తో తెరకెక్కించబోతున్నట్లుగా మహేష్ బాబు టీమ్ నుండి సమాచారం అందుతోంది.

Telugu Comments, Film News, Heroine, Mahesh And Namrata, Mahesh Babu, Mahesh Babu Wife, Namrata, Namrata Re Enty, Namrata Second Innings, Namrata Shirodhkar, Netizens, Producer, Social Media-Movie

ఆ సినిమాల నిర్మాణం మొత్తం కూడా నమ్రత చూసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.నిర్మాతగా ఎంట్రీ ఓకే కాని నటిగా మీరు మళ్లీ ఎప్పుడు వెండి తెరపై కనిపిస్తారు మేడం అంటూ చాలా మంది సోషల్‌ మీడియాలో ఆమెకు మెసేజ్ లు చేస్తున్నారు.ఆమె హీరోయిన్ గా నటించే అవకాశం లేదు.

అలా అని సెకండ్‌ ఇన్నింగ్స్ లో అక్కగా అమ్మగా నటించేందుకు ఆమె ఆసక్తి చూపించడం లేదు.కనుక ఆమె మళ్లీ వెండి తెరపై కనిపించడం అసాధ్యం అంటున్నారు.

#Heroine #Mahesh Babu #Namrata #NamrataSecond #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు