పుష్ప పోస్టర్‌తో జడుసుకున్న మహేష్ ఫ్యాన్స్  

Mahesh Babu Fans Upset With Pushpa - Telugu Aa20, Allu Arjun, Mahesh Babu, Pushpa, Sukumar

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్నాడు.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు క్యూ కట్టారు.

 Mahesh Babu Fans Upset With Pushpa

పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులు పట్టం కట్టారు.ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో తన నెక్ట్స్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా, తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.ఈ సినిమాకు ‘పుష్ప’ అనే టైటిల్‌ను అనౌన్స్ చేయడంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

పుష్ప పోస్టర్‌తో జడుసుకున్న మహేష్ ఫ్యాన్స్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ తనదైన మార్క్‌‌తో తెరకెక్కిస్తున్నాడు.అయితే ఈ సినిమాతో బన్నీ మరోసారి విధ్వంసం సృష్టించడం ఖాయమని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.

కాగా ఇటీవల సంక్రాంతి కానుకగా వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.అదే సమయంలో రిలీజ్ అయిన అల వైకుంఠపురములో సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.

ఇక ఇప్పుడు పుష్ప అనే ఊరమాస్ సినిమాను వచ్చే వేసవి కోసం రెడీ చేస్తున్నాడు బన్నీ.అయితే మహేష్ కూడా పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమాన తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించి వచ్చే వేసవి నాటికి రిలీజ్‌కు రెడీ చేయాలని మహేష్ ప్లాన్ చేస్తున్నాడు.దీంతో మరోసారి ఈ ఇద్దరు హీరోలు కూడా బాక్సాఫీస్ వద్ద యుద్ధానికి రెడీ అవుతున్నారు.

అయితే పరశురామ్‌కు స్టార్ హీరోలతో చేసిన అనుభవం లేకపోవడం, సుకుమార్ చేసిన స్టార్ హీరోల సినిమాలు దుమ్ములేపడంతో మహేష్ ఫ్యాన్స్ పుష్ప సినిమాతో కాస్త ఆందోళన చెందుతున్నారు.మరి ఈసారి పోటీలో ఎవరు గెలుస్తారా అనేది మాత్రం సినిమాలు రిలీజ్ అయ్యాకే చెప్పగలం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Fans Upset With Pushpa Poster Related Telugu News,Photos/Pics,Images..