6.2 కోట్లతో వరల్డ్‌ రికార్డ్‌ సాధించిన మహేష్‌ ఫ్యాన్స్‌  

Mahesh Babu Birthday, #HBDMaheshBabu, Mahesh Babu Fans, Twitter Record, Mahesh Fans Twitter Record 6.2Crores Tweets - Telugu #hbdmaheshbabu, Mahesh Babu Birthday, Mahesh Babu Fans, Mahesh Fans Twitter Record 6.2crores Tweets, Twitter Record, మహేష్ బాబు

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్బంగా ఆయన అభిమానులు ప్రపంచ రికార్డ్‌ను సాధించారు.దీనిని గిన్నీస్‌ రికార్డులో కూడా నమోదు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ట్విట్టర్‌లో 24 గంటల్లో ఏకంగా 6.2 కోట్ల ట్వీట్స్‌ను హ్యాపీ బర్త్‌డే మహేష్‌బాబు హ్యాష్‌ ట్యాగ్‌తో ట్వీట్‌ చేయడంతో సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ఈ రికార్డును దక్కించుకున్నారు.మహేష్‌బాబు ఫ్యాన్స్‌ తమ అభిమాన హీరోకు ఇచ్చిన అతి పెద్ద భారీ పుట్టిన రోజు కానుకగా చెప్పుకోవచ్చు.15 రోజుల క్రితం వీరు 3.1 కోట్ల ట్వీట్స్‌తో ఆల్‌ ఇండియా రికార్డును సాధించారు.ఈసారి ఎలాగైనా ప్రపంచ రికార్డును నమోదు చేయాలనే పట్టుదలతో ఈ రికార్డును సాధించారు.

 Mahesh Babu Fans Twitter Record

నిన్న సాయంత్రం ఆరు గంటలకు ఈ ట్రెండ్‌ ప్రారంభం అయిన విషయం తెల్సిందే.మొదటి మిలియన్‌ ట్వీట్స్‌ను కేవలం 9 నిమిషాల్లో మొదటి 10 మిలియన్‌ల ట్వీట్స్‌ను గంటన్నరలో చేసిన సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ 24 గంటలు గడిచేప్పటికి ఏకంగా 6.2 కోట్ల ట్వీట్స్‌ చేశారు.అయిదు కోట్ల వరకు ట్వీట్స్‌ నమోదు అవ్వాలనే టార్గెట్‌ తో ఈ ట్రెండ్‌ మొదలు పెట్టారు.అయితే ఏకంగా 1.2 కోట్లు అధనంగా ట్వీట్స్‌ నమోదు అయ్యారు.రికార్డు బద్దలు అవ్వడంతో పాటు ఆల్‌ టైం రికార్డును నమోదు చేసిన సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ఇతర స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌కు గట్టి టార్గెట్‌ పెట్టారు.మరి ఈ టార్గెట్‌ను ఎవరు బ్రేక్‌ చేస్తారో చూడాలి.

6.2 కోట్లతో వరల్డ్‌ రికార్డ్‌ సాధించిన మహేష్‌ ఫ్యాన్స్‌-Movie-Telugu Tollywood Photo Image
#Twitter Record #MaheshBabu ##HBDMaheshBabu #MaheshFans

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Fans Twitter Record Related Telugu News,Photos/Pics,Images..