మహేష్‌ అభిమానులకు 'మహర్షి' టెన్షన్‌.. తేడా కొట్టేనా ఏంటీ?

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు 25వ చిత్రంపై సినీ వర్గాల్లో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.తన ప్రతిష్టాత్మక 25వ చిత్రం అవ్వడంతో మహేష్‌బాబు గత చిత్రాల కంటే మరింత జాగ్రత్తలు తీసుకుని సినిమాను తెరకెక్కించడం జరుగుతోంది.

 Mahesh Babu Fans Tense With Maharshi Movie-TeluguStop.com

భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రంలోని కొన్ని సీన్స్‌ను రీ షూట్‌ చేయాలని, అందుకు టైం పట్టే అవకాశం ఉందని, అందుకే సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి.

సినిమా రీ షూట్‌కు సంబంధించి చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా కొందరు కన్ఫర్మ్‌ చేశారు.అయితే అధికారికంగా మాత్రం చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ విషయాన్ని అంగీకరించడం లేదు.పైగా రీ షూట్‌ ఏమీ లేదు, ముందు నుండి అనుకుంటున్నట్లుగానే సినిమాను ఏప్రిల్‌ 25న విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా ప్రకటించారు.25వ తేదీన ఖచ్చితంగా విడుదల అవుతుందని ప్రకటించిన నేపథ్యంలో ఫ్యాన్స్‌లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు.వాటితో సినిమా పూర్తి అవ్వాలి, కాని సీన్స్‌ రీ షూట్‌ చేయాలని భావించారు.వాటిని రెండు వారాల పాటు చేయబోతున్నారు.రెండు వారాల పాటు రీ షూట్‌ చేస్తే హడావుడి అవ్వడం, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌లో క్వాలిటీ ఉండక పోవడం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అదే జరిగితే మాత్రం మహర్షి ఫలితం తేడా కొట్టే అవకాశం ఉందని ఫ్యాన్స్‌ టెన్షన్‌ పడుతున్నారు.అయితే దిల్‌రాజు అండ్‌ కో మాత్రం ఈ చిత్రం ఈ ఏడాది బిగ్గెస్ట్‌ సక్సెస్‌ చిత్రాల జాబితాలో చేరుతుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

మరి చూడాలి ఫలితం ఎలా ఉంటుందో.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube