బంగారంలాంటి సినిమాను చంపేశారుగా.. మహేష్ బాబు ఫ్యాన్స్ బాధ ఇదే?

మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా నచ్చింది.అయితే సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి విపరీతంగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది.

 Mahesh Babu Fans Pain About Sarkaru Vaari Paata Movie Details Here Goes Viral ,-TeluguStop.com

సినిమా పరలేదనిపించేలా ఉన్నా ఈ సినిమా డిజాస్టర్ అని ప్రచారం చేస్తున్నారు.సర్కారు వారి పాట ఫస్టాఫ్ అద్భుతంగా ఉండగా సెకండాఫ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సోషల్ మీడియాలో బంగారంలాంటి సినిమాను చంపేశారని మహేష్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లకు సంబంధించిన చర్చ జరుగుతోంది.నెగిటివ్ టాక్ సర్కారు వారి పాట బుకింగ్స్ పై కూడా తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతుండటం గమనార్హం.

న్యూట్రల్ ఆడియన్స్ సైతం బాగానే ఉన్న సినిమాను కావాలని టార్గెట్ చేస్తున్నారని మరీ విసుగు తెప్పించే సినిమా అయితే కాదని వెల్లడిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో విడుదలై డిజాస్టర్ అయిన సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమా బెటర్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వరుసగా పెద్ద సినిమాలకు జరుగుతున్న నెగిటివ్ ప్రచారం భవిష్యత్తులో పెద్ద సినిమాల మనుగడనే ప్రశ్నార్థకం చేసే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.నెగిటివ్ టాక్, ట్రోల్స్ వల్ల భవిష్యత్తులో పెద్ద సినిమాలను నిర్మించాలంటే నిర్మాతలు సైతం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.

Telugu Flop, Keerthy Suresh, Negativity, Parushuram, Sarkaaruvaari-Movie

సాధారణంగా మహేష్ బాబు వివాదాలకు దూరంగా ఉంటారు.ఇలాంటి హీరోపై సోషల్ మీడియాలో ఈ స్థాయి నెగిటివిటీనా? అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.సర్కారు వారి పాట మేకర్స్ నెగిటివిటీని ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది.టికెట్ రేట్ల పెంపు పెద్ద సినిమాలకు నష్టం చేస్తున్న నేపథ్యంలో ఎఫ్3 సినిమా మేకర్స్ సాధారణ రేట్లతోనే టికెట్లను విక్రయించనున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube