కోటికి ఒక్క అడుగు దూరంలో ఉన్న మహేష్‌బాబు

టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో మహేష్‌బాబు ముందు ఉంటాడు.తన సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌కు తగ్గట్లుగా భారీ చిత్రాలు చేయడంతో పాటు భారీ ఎత్తున కంపెనీలకు అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.

 Mahesh Babu Fans Following In Twitter-TeluguStop.com

అన్ని విధాలుగా కూడా తనకు పోటీ ఉన్న హీరోలపై పైచేయి సాధిస్తున్న మహేష్‌బాబు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.ట్విట్టర్‌లో మహేష్‌బాబు ఏకంగా 10 మిలియన్‌ల మార్క్‌కు చేరువ అయ్యాడు.

Telugu Mahesh, Mahesh Babu-Movie

ప్రస్తుతానికి 9 మిలియన్‌లు అంటే 90 లక్షల వద్ద ట్విట్టర్‌లో మహేష్‌ బాబు ఫాలోవర్స్‌ ఉన్నారు.మహేష్‌బాబు తన ఫాలోవర్స్‌ సంఖ్య అంతకంతకు పెంచుకుంటూ పోతున్నాడు.ట్విట్టర్‌లో కోటి మంది ఫాలోవర్స్‌కు ఒక్క మిలియన్‌ దూరంలో ఉన్నాడు.అతి త్వరలోనే ఆ మిలియన్‌ కూడా వస్తారని అంతా నమ్మకంగా ఉన్నారు.ఈ ఏడాది చివరి వరకు మహేష్‌బాబు ట్విట్టర్‌ ఫాలోవర్స్‌లో కోటీశ్వరుడు అయ్యే అవకాశం ఉందని నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మహేష్‌బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్‌బాబు తన 27వ చిత్రానికి సంబంధించిన చర్చల్లో ఉన్నాడు.

మొన్నటి వరకు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌ 27 ఉంటుందని అంతా భావించారు.కాని ఇప్పుడు ఆయన కాకుండా మరో దర్శకుడితో ఉంటుందని ప్రచారం జరుగుతోంది.సమ్మర్‌ చివరి వరకు మహేష్‌ తదుపరి చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube