'రానా షోలో అలా అన్నావ్...మరి ఇప్పుడెలా సమర్ధించుకుంటావ్?' అని సమంతపై మహేష్ ఫాన్స్ ఫైర్.!  

  • గత దశాబ్దం నుండి తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత దాదాపు అగ్ర హీరోలందరితో నటించి హిట్స్ అందుకుంది. సమంత హీరోయిన్ అంటే హిట్ గారంటీ అన్న సెంటిమెంట్ సంపాదించుకుంది. ఆ టాప్ హీరోయిన్ గా మాత్రమే కాదు అక్కినేని ఇంటి కోడలిగా కూడా సమంత మంచి పేరు తెచ్చుకుంది.

  • Mahesh Babu Fans Fire On Samantha-Naga Chaitanya No.1 Yaari With Rana Samantha

    Mahesh Babu Fans Fire On Samantha

  • రీసెంట్ గా రానా నెంబర్ వన్ యారి షోలో రానా సమంతను “నీకు పెట్స్ ఉన్నాయా.?” అంటేనాగ చైతన్య అని సమాధానం ఇచ్చింది సమంత. ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ సమంతని ప్రశ్నిస్తున్నారు. మధ్యలో మహేష్ బాబు ఫాన్స్ ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా.? దాని వెనకాల కారణం 1 నేనొక్కడినే సినిమా.


  • అందులో మహేష్ బాబు నడుస్తూ వెళ్తుంటే ఆయన పాదాలు అచ్చులను చేతితో పట్టుకుంటూ హీరోయిన్ ఉండే పోస్టర్ పై సమంత చేసిన కామెంట్స్ మహేష్ అభిమానులకి ఆగ్రహాన్ని తెప్పించాయి. అప్పట్లో సమంతపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు మహేష్ ఫ్యాన్స్. అయితే ఇప్పటికీ ఆ విషయాన్ని వారు మర్చిపోలేదని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఆరోజు మహేష్ సినిమా పోస్టర్ చూసే అంతగా రియాక్ట్ అయిన సమంత ఈరోజు చైతూని పెట్ అని ఎలా అంటుంది.సమంత ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించలేదు. మరి తనను తాను ఎలా సమర్ధించుకుంటుందో చూడాలి! తాను కామెడీ గానే చెప్పినా…ఫాన్స్ మాత్రం తప్పుగా తీసుకుంటున్నారు.