ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ చేసిందే మహేష్‌ ఫ్యాన్స్‌ చేస్తున్నారు!     2018-08-10   08:39:51  IST  Ramesh Palla

టాలీవుడ్‌ స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ తమ అభిమాన హీరోలపై ఈగ కూడా వాలనివ్వరు. ముఖ్యంగా పవన్‌, ఎన్టీఆర్‌, మహేష్‌బాబు, చరణ్‌ వంటి స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ ఎప్పుడు కూడా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తమ అభిమాన హీరో గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తారు. తాజాగా ఎన్టీఆర్‌ విషయంలో నటుడు ఆదర్శ్‌ బాలకృష్ణ తీరును నందమూరి అభిమానులు తప్పుబట్టారు. ఎన్టీఆర్‌ను గౌరవం లేకుండా సంభోదించాడని, అసు ఎన్టీఆర్‌ ట్విట్టర్‌ ఖాతా కూడా సరిగా తెలియకుండా ట్యాగ్‌ చేశాడు అంటూ ఆదర్శ్‌ బాలకృష్ణపై ఫ్యాన్స్‌ రెండు రోజులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Mahesh Babu Fans Fire On Pooja Hegde-

Mahesh Babu Fans Fire On Pooja Hegde

నందమూరి ఫ్యాన్స్‌ విమర్శలకు బ్రేక్‌ వేసేందుకు ఆదర్శ్‌ తన పోస్ట్‌లో ఎలాంటి తప్పుడు ఉద్దేశ్యం లేదని, ఎన్టీఆర్‌ అన్న అంటే తనకు చాలా గౌరవం ఉందని చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్‌ అన్న అంటూ సంభోదించడంతో వివాదం సర్దుమనిగింది. ఇప్పుడు ఇదే తరహా వివాదం పూజా హెగ్డే విషయంలో జరుగుతుంది. మహేష్‌బాబు తాజాగా పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఆ సందర్బంగా పలువురు స్టార్స్‌ మహేష్‌బాబుకు బర్త్‌డే విశెష్‌ చెప్పడం జరిగింది. ఇదే సమయంలో మహేష్‌ 25వ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తూ ఉన్న పూజా హెగ్డే కూడా విషెష్‌ చెప్పింది. అదే ఇప్పుడు ఫ్యాన్స్‌కు కోపం తెప్పిస్తుంది.

Mahesh Babu Fans Fire On Pooja Hegde-

ట్విట్టర్‌లో మహేష్‌బాబుకు బర్త్‌డే విషెష్‌ చెబుతూ హ్యాపీబర్త్‌డే మహర్షి అంటూ పోస్ట్‌ చేసింది. దాంతో మహేష్‌ ఫ్యాన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహేష్‌బాబుపై ఎలాంటి గౌరవం లేకుండా ఏకవచనంతో పిలవడం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహర్షి అంటూ పిలిచినప్పుడు హీరోయిన్‌ కనుక గారు, సర్‌ వాడాల్సిన అవసరం లేదని కొందరు అంటుంటే, మరి కొందరు మాత్రం పూజా గౌరవం లేకుండా విషెష్‌ చెప్పిందని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మహేష్‌బాబు ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో ఇప్పుడు పూజాను టార్గెట్‌ చేశారు.

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ చేసిన పనిని మహేష్‌బాబు ఫ్యాన్స్‌ ఆదర్శంగా తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ తీవ్ర స్థాయిలో ఆదర్శ్‌ బాలకృష్ణపై విరుచుకు పడటంలో ఒక అర్థం ఉంది. కాని మహేష్‌బాబు ఫ్యాన్స్‌ విషయంలో మాత్రం ఇది ఎంత మాత్రం సమంజసం కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ట్రెండ్‌ అవ్వడం కోసం ఫ్యాన్స్‌ కొన్ని సార్లు ఇలా వివాదాన్ని మొదలు పెడతారు అంటూ కొందరు అంటున్నారు. ఇంతకు ఈ వివాదంపై ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఏమంటుందో చూడాలి.