మొన్నటి వరకూ టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న ఎంతో మంది హీరోలు ఇక ఇప్పుడు తమ మార్కెట్ ను మరింత పెంచుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే మొన్నటి వరకూ తెలుగు హీరోల సినిమాలు అంటే టాలీవుడ్ తో పాటు కోలీవుడ్లో కూడా ఆదరణ పొందేవి.
కానీ బాలీవుడ్లో అంతంత మాత్రంగానే తెలుగు హీరోల సినిమాలు ఆడేవి.కానీ ఇటీవలి కాలంలో టాలీవుడ్ హీరోలు నటించిన సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులను తెగ ఆకర్షిస్తున్నాయి.
దీంతో తెలుగు హీరో ఏ సినిమాలో నటించిన కూడా ఆ సినిమాను చూసేందుకు సిద్ధమైపోతున్నారు బాలీవుడ్ ప్రేక్షకులు.
అదే సమయంలో ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోలు గా ఉన్నవారు తమ సినిమాలను హిందీలో కూడా విడుదల చేస్తూ ఉండటం గమనార్హం.
ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి హీరోలు నార్త్ పై కూడా దృష్టి పెట్టారు.ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కూడా బాలీవుడ్లో మార్కెట్ పెంచుకోవడానికి రెడీ అయిపోతున్నాడు.
అప్పటికే మహేష్ బాబు నటించిన పోకిరి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి లాంటి సినిమాలు అటు బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించాయి.యూట్యూబ్ లో రికార్డులు సృష్టించాయి.
దీంతో టాలీవుడ్ సూపర్ స్టార్ కు బాలీవుడ్ లో కూడా క్రేజ్ వచ్చేసింది.అంతేకాదండోయ్ ఎంతోమంది బాలీవుడ్ హీరోయిన్లు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ తో నటించడానికి ఆసక్తి చూపుతూ ఉండటం గమనార్హం.
అదే సమయంలో అటు బాలీవుడ్ దర్శకులు కూడా మహేష్ నార్త్ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట.ఈ క్రమంలోనే ప్రస్తుతం మహేష్ ఒక పెద్ద ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాని హిందీలో కూడా విడుదల చేయాలని అనుకుంటున్నాడట.ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాను కూడా తెలుగు తమిళ్, కన్నడ హిందీ భాషల్లో కూడా విడుదల చేసి మార్కెట్ పెంచుకోవాలని అనుకుంటున్నాడట మహేష్ బాబు.
ఇక ఆ తర్వాత రాజమౌళితో సినిమా చేయనుండగా.రాజమౌళి సినిమా అంటే ఎలాగో బాలీవుడ్లో ఊహించని రేంజ్ లో క్రేజ్ ఉంటుంది.కాబట్టి ఇక ఇదంతా క్యాష్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయాడట టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.