41 ఏళ్లు పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ సినీ ప్రస్తానం  

టాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకొని నెంబర్ వన్ హీరోగా ఉన్న నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు.రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు తరువాత కెరియర్ లో వరుసగా ఫ్లాప్ సినిమాలతో వెనుక పడ్డాడు.

TeluguStop.com - Mahesh Babu Completes 41 Glorious Years In Telugu Industry

అయితే మురారి సినిమాతో అతని ఇమేజ్ మారిపోయింది.ఒక్కడు సినిమాతో స్టార్ హీరోగా మహేష్ బాబు మారిపోయాడు.

తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ మీద సక్సెస్ కొడుతూ దూసుకుపోతున్నాడు.గత కొంత కాలంలో కెరియర్ లో ఫ్లాప్ లేకుండా మహేష్ బాబు సినిమాలు చేస్తున్నాడు.

TeluguStop.com - 41 ఏళ్లు పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ సినీ ప్రస్తానం-General-Telugu-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం అతని మార్కెట్ వాల్యూ సుమారు రెండు వందల కోట్ల వరకు ఉంది.అతనితో సినిమా చేయాలంటే తక్కువలో తక్కువగా డెబ్భై కోట్లు బడ్జెట్ రెడీ చేసుకోవాల్సిందే.

ఆ స్థాయికి తన మార్కెట్ స్టామినాని సూపర్ స్టార్ మహేష్ పెంచుకున్నాడు.ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాకి రెడీ అవుతున్నాడు.

Telugu Celebrity Journey, Mahesh Babu, Super Star, Telugu Cinema, Telugu Industry, Tollywood-Latest News - Telugu

ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో నటుడుగా ఎంట్రీ ఇచ్చి ఏకంగా 41 ఏళ్ల ప్రస్తానం పూర్తి చేసుకున్నాడు.1979లో నీడ సినిమాతో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి తరువాత వరుస సినిమాలు చేశాడు.చైల్డ్ ఆర్టిస్ట్ గానే హీరోయిజం ఉన్న పాత్రలు చేసి మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా 1990లో చివరిగా బాలచంద్రుడు సినిమాలో నటించాడు.తరువాత తొమ్మిదేళ్లు గ్యాప్ తీసుకొని 1999లో రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.తరువాత అప్రతిహితంగా తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు.41 ఏళ్ల సుదీర్ఘ నట ప్రస్తానం కలిగి ఉన్న నటుడుగా సూపర్ స్టార్ మహేష్ బాబు అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

.

#Mahesh Babu #Super Star

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Completes 41 Glorious Years In Telugu Industry Related Telugu News,Photos/Pics,Images..