రాజమౌళి కోసం నేను కూడా సిద్దమంటున్న మహేష్‌ బాబు

బాహుబలి సినిమాను ప్రభాస్ తో రాజమౌళి దాదాపు గా ఆరు సంవత్సరాలు చేయడం జరిగింది.బాహుబలి రెండు పార్ట్‌ లకు మాత్రమే కాకుండా అంతకు ముందు మరియు ఆ తర్వాత కూడా రాజమైళి భారీ ఎత్తున టైమ్‌ తీసుకుని సినిమాలను చేసిన విషయం తెల్సిందే.

 Mahesh Babu Comments On Rajamouli Film , Mahesh Babu , Rajamouli Film , Mahesh Babu Comments , Rajamouli , Movie News , Rrr Movie , Sarakaru Vaari Paata-TeluguStop.com

అందుకు రాజమౌళి తో సినిమాలు అంటే హీరోలు కాస్త ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది అనే ఒక వాదన పడిపోయింది.నిజంగానే రాజమౌళి తో సినిమా చేసే వారు కనీసం రెండు సంవత్సరాల పాటు ఇతర కమిట్‌మెంట్స్ ఏమీ పెట్టుకోకుండా పూర్తి గా రాజమౌళికి సమయం కేటాయించాలి.

మహేష్ బాబు తదుపరి సినిమా త్రివిక్రమ్ తో చేయబోతున్నాడు.ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా ఉంటుంది.

 Mahesh Babu Comments On Rajamouli Film , Mahesh Babu , Rajamouli Film , Mahesh Babu Comments , Rajamouli , Movie News , RRR Movie , Sarakaru Vaari Paata-రాజమౌళి కోసం నేను కూడా సిద్దమంటున్న మహేష్‌ బాబు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మహేష్ బాబు తన ప్రతి సినిమా ను అయిదు ఆరు నెలలు మహా అయితే ఏడాది పాటు చేస్తూ ఉంటాడు.కాని రాజమౌళి తో సినిమా అంటే రెండేళ్ల సమయం పడుతుంది కదా ఎలా మరి అంటూ మీడియా వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమా ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలో భాగంగా మహేష్‌ బాబు స్పందించాడు.రాజమౌళి తో సినిమా విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.జనాలు మా నుండి ఏం కోరుకుంటున్నారో తెలుసు.దాన్ని బట్టి సినిమా ఉంటుంది అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

అదే సమయం లో మహేష్ బాబు స్పందిస్తూ రాజమౌళి వంటి దర్శకుడి తో ఒక్క సినిమా చేస్తే 25 సినిమా ల అనుభవం మరియు క్రేజ్ వస్తుంది.అందుకే ఆయన తో సినిమా కు కాస్త ఎక్కువ డేట్లు ఇచ్చేందుకు కూడా సిద్దం అన్నట్లుగా మహేష్‌ బాబు ప్రకటించాడు.2025 లో వీరి కాంబో సినిమాలు వస్తాయనే వార్తలు వస్తున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube