చరణ్‌, ఎన్టీఆర్‌లతో టూర్‌ ప్లాన్‌ చేస్తున్న మహేష్‌బాబు  

Mahesh Babu Comments On Ntr And Charan - Telugu Charan And Ntr, Jolly Trip With Ntr And Mahesh Babu And Charan, Mahesh Babu, , Prince Mahesh Babu, Tollywood, Tollywood Top Heros

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ఫ్యాన్స్‌ ఇంకా చరణ్‌, ఎన్టీఆర్‌ల ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో ఏ విధమైన యుద్దం చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సోషల్‌ మీడియాలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడంతో పాటు బాహాటంగా దాడులకు దిగిన సందర్బాలు కూడా ఉన్నాయి.

Mahesh Babu Comments On Ntr And Charan

కాని ఆ ముగ్గురు హీరోలు మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు.వారి అభిమానులు కొట్టుకు చస్తుంటే వారు మాత్రం చాలా జాలీగా ట్రిప్‌కు ప్లాన్‌ చేస్తున్నారు.

మహేష్‌బాబు ఇటీవల ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.తనకు ఎన్టీఆర్‌ రామ్‌ చరణ్‌లతో జాలీ రోడ్డు ట్రిప్‌ వెళ్లాలని ఉందన్నాడు.ఒక లాంగ్‌ డ్రైవ్‌ను వారితో ఎంజాయ్‌ చేయాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.టాలీవుడ్‌లో ఆ హీరోలు ఇద్దరు మహేష్‌బాబుకు బెస్ట్‌ బడ్డీస్‌గా నిలిచి పోయారు.ఈ ముగ్గురు అనేక సందర్బాల్లో కలిసి సందడి చేసిన విషయం తెల్సిందే.

ప్రస్తుతం వీరు ముగ్గురు కూడా టాలీవుడ్‌లో మోస్ట్‌ టాప్‌ హీరోలు.ఇక వీరు ముగ్గురు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలుగా కూడా నిలిచారు.అలాంటి వీరు ఇంత స్నేహంగా ఉండటం అనేది చాలా అరుదైన విషయం.

ఈ ముగ్గురి స్నేహం ఇలాగే ఉండాలని మనం అంతా కోరుకుందాం.ఈ ముగ్గురు ఫ్యాన్స్‌ కూడా కలిసి పోవాలని ఆశిద్దాం.

తాజా వార్తలు