తెలుగు సినీ పరిశ్రమలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి తెలియని వారుండరు. ఆ మధ్య కాలంలో మహేష్ బాబు నటించిన భరత్ అను నేను, మహర్షి, సరిలేరు, నీకెవ్వరు, తదితర హిట్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టాడు.
కాగా ప్రస్తుతం మహేష్ బాబు వరుస హిట్లతో దూసుకు పోతున్నాడు.
అయితే తాజాగా మహేష్ బాబు కి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
అయితే ఆ ఫోటో ని ఒకసారి పరిశీలించినట్లయితే మహేష్ బాబు చిన్నప్పుడు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తో కలిసి తీయించుకున్నట్లు తెలుస్తోంది.దీంతో మహేష్ బాబు అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాగానే వైరల్ చేస్తున్నారు.
అంతేగాక చిన్నప్పుడు మహేష్ బాబు చాలా క్యూట్ గా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
కాగా ఈ చిత్రానికి గీతా గోవిందం చిత్రం ఫేమ్ దర్శకుడు పరుశురాం దర్శకత్వం వహిస్తున్నాడు.ఇటీవలే మహేష్ బాబు పుట్టి నరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ని విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది.