మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కొడుకు నటించిన సినిమాలేంటో తెలుసా..?

సూపర్ స్టార్ కృష్ణ అంటే అప్పట్లో డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అని చెప్పచ్చు.ఎందుకంటే కృష్ణ గారు సినిమా కోసం ఏదైనా చేసేవాళ్ళు తెలుగులో ఫస్ట్ కౌబాయ్ సినిమా తీసింది కృష్ణ గారే అదే మోసగాళ్లకు మోసగాడు.

 Mahesh Babu Brother Ramhesh Babu Son Also Acted In Movies-TeluguStop.com

ఆయన దేనికి భయపడే వారు కాదు.అయితే కృష్ణ గారి సినిమాలు అప్పట్లో చాలా ప్రభంజనాలు క్రియేట్ చేసాయి.

కృష్ణ తర్వాత ఆ ఇంటి నుండి వచ్చిన రమేష్ బాబు సినిమాల్లో పెద్దగా రాణించలేదనే చెప్పాలి.ఎందుకంటే అయన కొన్ని సినిమాలు తీసి ఆపేసారు దీంతో కృష్ణ కూడా చేసేదేమిలేక రమేష్ ని ప్రొడ్యూసర్ ని చేసాడు.

 Mahesh Babu Brother Ramhesh Babu Son Also Acted In Movies-మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కొడుకు నటించిన సినిమాలేంటో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రమేష్ తర్వాత మహేష్ ని రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో రాజకుమారుడు మూవీ తో హీరో గా పరిచయం చేసాడు.అది హిట్ అవ్వడం తో మహేష్ కి మంచి సినిమాలు వచ్చాయి.

ఒక్కడు మూవీ తో మహేష్ లోని నటన బయిటికి వచ్చింది ఒక మాస్ హీరో కి ఒక మాస్ కథ పడితే ఎలా ఉంటుందో చూపించిన సినిమా అది.దాని తర్వాత అతడు తో ఒక డీసెంట్ హిట్ కొట్టిన మహేష్ తర్వాత పూరి డైరెక్షన్ లో వచ్చిన పోకిరి తో ఇండస్ట్రీ లెక్కలు మొత్తం మార్చేశాడు.చిరంజీవి తర్వాత అంతటి మాస్ హీరో మహేష్ బాబు మాత్రమే అనే రేంజ్ కి వెళ్ళాడు.మహేష్ కి పోకిరి తర్వాత ఒక ౩ సంవత్సరాలు హిట్ లేకుండా పోయింది.

దింతో శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన దూకుడు తో మల్లి కంబ్యాక్ ఇచ్చాడు అయితే సుకుమార్ తో చేసిన 1 మూవీలో తనలోని నటనని మొత్తం బయిటికి తీసాడు సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా మహేష్ కి ఒక మంచి నటుడుగా గుర్తింపు వచ్చింది.  ఈ మూవీ లో మహేష్ కొడుకు గౌతమ్ కూడా మహేష్ చిన్నప్పటి క్యారెక్టరు చేసాడు.

Telugu Jayakrishna, Mahesh Babu, Mahesh Babu Brother Ramesh Babu News, Raghavendrarao, Ramesh Babu Son, Srimanthudu-Telugu Stop Exclusive Top Stories

 ఈ సినిమా తర్వాత కొరటాల డైరెక్షన్ లోవచ్చిన శ్రీమంతుడు మూవీ తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.మహేష్ రీసెంట్ గా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు.మహేష్ ఇప్పుడు గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్ లో సర్కారువారి పాట మూవీ లో ఆక్ట్ చేస్తున్నాడు.   దీని తర్వాత మహేష్ రాజమౌళి తో చేస్తాడా లేదా అనేది చూడాలి .ఇప్పుడు రాజమౌళి RRR షూట్ లో ఉన్నాడు ఈమూవీ షూట్ అయిపోయి సినిమా రిలీజ్ అయ్యే టైం కి మహేష్ సర్కారు వారి పాట షూట్ అయిపోతుంది.దింతో ఇద్దరు ఫ్రీ గానే ఉంటారు కాబట్టి సినిమా తీసే అవకాశం అయితే ఉంది.

తన తమ్ముడు అంతపెద్ద హీరో అవ్వడం చుసిన రమేష్ బాబు తన కొడుకుని కూడా ఇండస్ట్రీ లోకి తీసుకువద్దామని ప్లాన్ లో ఉన్నారట దానికోసం రమేష్ బాబు తన కొడుకు అయినా జయకృష్ణ ని యాక్టింగ్ క్లాస్ లకి కూడా పంపుతున్నారని తెలుస్తుంది.మహేష్ కూడా తొందర్లోనే గౌతమ్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేయాలనీ చూస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక మహేష్ నమ్రత ఇద్దరు కూడా గౌతమ్ విషయం లో చాల కేర్ గా ఉంటారని, ఆయన్ని ఎప్పుడు లాంచ్ చేయాలో అప్పుడే లాంచ్ చేస్తామని గతం లో చాల సార్లు చెప్పారు.

అయితే అన్న కొడుకు అయినా జయకృష్ణ సినిమాల్లో హీరో గా వస్తే ఘట్టమనేని ఫామిలీ నుంచి మహేష్ తర్వాత వచ్చిన ఇంకో హీరో జయ కృష్ణ అవుతాడు.

ఇక ఇదివరకే జయ కృష్ణ మహేష్ బాబు సినిమాలో నటించాడు.నిజం సినిమా మొదటి హాఫ్ లో జయకృష్ణ కాసేపు కనిపిస్తాడు.

ఆ తర్వాత మల్లి ఏ సినిమాలోనూ అతడు నటించలేదు.మెగా ఫామిలీ నుంచి డజను మంది హీరో లు ఉంటె, అక్కినేని ఫామిలీ నుంచి అరడజను మంది ఉన్నారు అలాగే నందమూరి ఫామిలీ నుండి చాల మంది వచ్చిన ప్రస్తుతం బాలయ్య, కళ్యాణ్ రామ్,ఎన్టీఆర్ మాత్రమే సినిమాలు చేస్తున్నారు.

అయితే జయ కృష్ణ రాకతో ఒంటరిగా ఉన్న మహేష్ కి తోడుగా వచ్చి పెద్ద హీరోలా లిస్ట్ లో నిలబడతాడో లేక వాళ్ళ నాన్న లగే వెనుతిరుగుతాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి…విల్లా తో పాటు వెంకటేష్ కొడుకు, పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరా నందన్ కూడా వస్తారు.ఇక ఫ్యూచర్ లో మహేష్బాబు కొడుకు వెంకటేష్ కొడుకు కలిసి సీతమ్మ వాకిట్లో మూవీకి రీమేక్ చేస్తారేమో చూడాలి అలాగే పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరా నందన్ వెంకటేష్ కొడుకు కలిసి గోపాల గోపాల అంటూ మల్లి మల్టీ స్టారర్ మూవీస్ చేస్తారేమో చూడాలి.

#Mahesh Babu #Jayakrishna #Raghavendrarao #MaheshBabu #Srimanthudu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు