తండ్రికి పుట్టినరోజు విషెస్ ఇలా చెప్పిన మహేష్

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తన పుట్టినరోజును ప్రతి ఏటా ఘనంగా అభిమానుల మధ్య జరుపుకుంటారు.అయితే గతేడాది ఆయన సతీమణి విజయనిర్మల మృతిచెందడం, ఇంకా ప్రథమ వర్ధంతి జరగకపోవడంతో కృష్ణ ఈసారి ఎలాంటి పుట్టినరోజు వేడుకలు నిర్వహించకూడదని నిర్ణయించారు.

 Mahesh Babu Best Birthday Wish To Father, Mahesh Babu, Super Star Krishna, Krish-TeluguStop.com

ఇక ఆయన మాటకు గౌరవం ఇస్తూ అభిమానులు కూడా కృష్ణ పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం లేదు.

కాగా తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజును మహేష్ బాబు చాలా స్పెషల్ డేగా చూస్తుంటాడు.

ఈ క్రమంలోనే తన తండ్రికి తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు మహేష్.ట్విట్టర్ వేదికగా తన తండ్రితో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ, తన తండ్రికి జీవితాంత రుణపడి ఉంటానంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.

నాన్న తన ఎవర్‌గ్రీన్ సూపర్ స్టార్ అంటూ తండ్రికి పుట్టినరోజు విషెస్ చెప్పుకొచ్చాడు మహేష్.ఇలా తన తండ్రి పట్ల మహేష్ ప్రేమను చూసి ఘట్టమనేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇక కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్ కొత్త సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించేందుకు రెడీ అయ్యింది.ఈ సినిమాకు ‘సర్కారి వారి పాట’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాను గీతాగోవిందం ఫేం దర్శకుడు పరశురామ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.కాగా ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube