అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు సీక్రెట్స్ రివిల్ చేస్తానంటున్న మంజుల..!

ఘట్టమనేని కుటుంబంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి మంజుల.ఈవిడ సూపర్ స్టార్ కృష్ణ కూతురు అయినా సరే శభాష్ గోపి అనే సినిమాలో చిన్న వయసులోనే నటించి అందరిని మెప్పించింది.

 Mahesh Babu Sister Manjula Reveals Secrets About Super Star, Mahesh Babu Sister-TeluguStop.com

ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఆవిడ మళ్ళీ తన తండ్రి కోరిక మేరకు సినిమాల వైపు వెళ్ళలేదు.కేవలం నటిగా మాత్రమే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగా కూడా పని చేసిన అనుభవం ఉంది.

అయితే ప్రస్తుతం సినిమాలను పక్కన పెట్టి కొన్ని వెల్ నెస్ ప్రొడక్ట్స్ ను లాంచ్ చేసింది ఆవిడ.అయితే తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ తన ఘట్టమనేని ఫ్యామిలీ గురించి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎన్నో విషయాలను తెలిపింది.

అవేంటో ఒకసారి చూద్దామా.

ఘట్టమనేని మంజుల మాట్లాడుతూ… మహేష్ బాబు తన కంటే చిన్నవాడు అయినప్పటికీ తాను ఎంతో మెచ్యూర్డ్ పర్సన్ అని తెలిపింది.

తనకంటే వయసులో నేను పెద్దదాన్ని కావడంతో తాను మహేష్ ను గైడ్ చేస్తానని అంతా అనుకుంటారు, నిజానికి మహేష్ బాబు నన్ను గైడ్ చేస్తుంటాడు అని తెలిపింది.ఏ విషయానికి సంబంధించిన విషయం అయినా సరే పర్ఫెక్ట్ గా సలహా ఇస్తూ ఉంటాడు అని తెలియజేసింది.

బయటికి మహేష్ బాబు ఓ సూపర్ స్టార్ వెలుగు వెలుగుతున్న ఆ సూపర్ స్టార్ వెనకాల ఎన్నో సీక్రెట్ దాగి ఉన్నాయని తెలిపింది.ఇందుకు సంబంధించి కొన్ని సీక్రెట్స్ త్వరలోనే రివీల్ చేస్తానని తెలియజేసింది.

వీటితోపాటు తనని కొందరు మీ బ్యూటీ సీక్రెట్స్ ఏంటని అడుగుతారని తెలియజేసింది.

Telugu Fitness, Maheshbabu, Manjula-Movie

అయితే అందుకు ఆవిడ తనకి ఎలాంటి సీక్రెట్స్ లేవని అవన్నీ తన నాన్నగారి నుండి జీన్స్ అని మాత్రమే చెప్పగలను అని తేల్చేసింది.నిజానికి నేను అందరికీ ఓ సినిమా మేకర్ గానే తెలుసు కానీ తన లో ఇంకో కోణం కూడా ఉందని తెలిపింది.ఇందుకు సంబంధించి ఆవిడ మాట్లాడుతూ.

ఎక్ససైజ్, ఫిట్నెస్, వెల్ నెస్ వంటివి తన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర కలిగి ఉన్నాయని తెలిపింది.తన జీవితంలో చిన్నప్పటి నుంచి రోజురోజుకు వీటిపై మరింత ఆసక్తిని పెంచుకుంటూ తెలుసుకున్నట్లు తెలిపింది.

ఇందులో భాగంగానే తనకు తెలిసిన విషయాలని ప్రజలకి అందించాలని అనుకుంటున్నట్లు తెలిపింది.అలాగే సంతోషంగా ఉండడానికి ఏం చేయాలో ఎలాంటి విషయాలను పాటించాలో కూడా ఆవిడ తెలియజేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube