మహేష్ నిజంగా గ్రేట్.. కరోనాతో బాధపడుతున్నా చిన్నారి ప్రాణానికి అండగా ?

Mahesh Babu Association With Hospital Saved 1057th Baby Child

స్టార్ హీరో మహేష్ బాబుకు కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.మహేష్ బాబుకు కరోనా సోకడం వల్ల అన్న రమేష్ బాబు అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు.

 Mahesh Babu Association With Hospital Saved 1057th Baby Child-TeluguStop.com

ప్రస్తుతం మహేష్ బాబు హోం ఐసోలేషన్ లో ఉండగా మహేష్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.అయితే మహేష్ ఒకవైపు కరోనాతో బాధ పడుతున్నా చిన్నారి ప్రాణానికి అండగా నిలవడం గమనార్హం.

ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడం ద్వారా మహేష్ బాబు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. శిరీష అనే మహిళకు  నెలరోజుల క్రితం చిన్నారికి జన్మనిచ్చింది.

 Mahesh Babu Association With Hospital Saved 1057th Baby Child-మహేష్ నిజంగా గ్రేట్.. కరోనాతో బాధపడుతున్నా చిన్నారి ప్రాణానికి అండగా -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఆ బాబుకు ఆరోగ్య సమస్య ఉండగా సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో మహేష్ బాబు సర్జరీ చేయించారు.సర్జరీ విజయవంతంగా పూర్తి కాగా మహేష్ ఇప్పటివరకు ఏకంగా 1057 మంది చిన్నారులకు సర్జరీలు చేయించారు.

మహేష్ బాబు భార్య నమ్రత సర్జరీ చేయించుకున్న బాబు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేయడం గమనార్హం.మరోవైపు మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కొంతభాగం మిగిలి ఉంది.

అటు మహేష్ బాబుకు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ కు కరోనా సోకడంతో ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ అలస్యమవుతూ ఉండటం గమనార్హం.అనుకున్న తేదీకీ సర్కారు వారి పాట రిలీజవుతుందో లేదో చూడాలి.

Telugu Child, Mahesh Babu-Movie

పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.గీతా గోవిందం సినిమా అంచనాలకు మించి విజయం సాధించడంతో పరశురామ్ కు ఈ సినిమాకు డైరెక్షన్ చేసే ఛాన్స్ దక్కింది.100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో భారీ అంచనాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది.సర్కారు వారి పాట సినిమా కొత్త తరహా కథాంశంతో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో మెసేజ్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

#Child #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube