బన్నీని ఫాలో అవుతూ మహేష్‌ కొత్త ప్రకటన  

Mahesh Babu Announce Next Movie on Birthday,Mahesh Babu, Koratala Siva, parasuram, Mahesh 28th Movie, Mahesh babu Birthday - Telugu Koratala Siva, Mahesh 28th Movie, Mahesh Babu, Mahesh Babu Announce Next Movie On Birthday, Mahesh Babu Birthday, Parasuram

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు పుట్టిన రోజు నేడు.ఈ సందర్బంగా ఆయన కొత్త సినిమాను ప్రకటించబోతున్నారు.

 Mahesh Babu Announce Next Movie Birthday

సరిగ్గా ఉదయం 9 గంటల 9 నిమిషాలకు మహేష్‌బాబు 28వ సినిమా ప్రకటన ఉంటుందని ఇప్పటికే అనౌన్స్‌మెంట్‌ వచ్చింది.ఆ సినిమా ఎవరితో ఏంటీ అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది.

మహేష్‌ 27వ సినిమా సర్కారు వారి పాట ఇంకా పట్టాలు ఎక్కలేదు.ఈ ఏడాది చివరి వరకు సినిమా పట్టాలు ఎక్కే మార్గం కనిపించడం లేదు.

బన్నీని ఫాలో అవుతూ మహేష్‌ కొత్త ప్రకటన-Movie-Telugu Tollywood Photo Image

అంటే సినిమా వచ్చే ఏడాది చివరి వరకు వచ్చే అవకాశం ఉంది.ఇలాంటి సమయంలో మరో సినిమాను మహేష్‌ బాబు ప్రకటించబోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు.

ఇటీవల అల్లు అర్జున్‌ పుష్ప చిత్రం కాకుండా మరో సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో ప్రకటించిన విషయం తెల్సిందే.పుష్ప చిత్రం ఇంకా పట్టాలు ఎక్కక ముందే కొరటాల శివ సినిమాను ప్రకటించాడు.

ఈ రెండు సినిమాలు సమాంతరంగా కాకుండా ఒక దాని తర్వాత ఒకటి అన్నట్లుగానే చేస్తానంటూ బన్నీ ప్రకటించాడు.మహేష్‌బాబు కూడా ఈమద్య కాలంలో ఒకే సమయంలో రెండు సినిమాలు చేయలేదు.

కనుక సర్కారు వారి పాట సినిమా పూర్తి అయిన తర్వాతే 28వ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.అంటే చాలా సమయం ఉందన్నమాట.

సినిమా ప్రారంభంకు చాలా సమయం ఉన్నా అభిమానులను సంతోష పెట్టే ఉద్దేశ్యంతో మహేష్‌బాబు తన 28వ సినిమా ప్రకటన చేయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు 27వ సినిమా చేయాల్సి ఉండే.కాని ఆ ఛాన్స్‌ పరశురామ్‌ దక్కించుకున్నాడు.మరి 28 ఛాన్స్‌ ఎవరికి దక్కేను అనేది చర్చనీయాంశంగా ఉంది.

#MaheshBabu #MaheshBabu #Koratala Siva #Mahesh Babu #Parasuram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Announce Next Movie Birthday Related Telugu News,Photos/Pics,Images..