ఆ డైరెక్టర్ నాకు ఫిట్టింగ్ పెట్టాడంటున్న మహేష్ బాబు....  

Mahesh Babu Doing Sensational Comments On Anil Ravipudi-director Anil Ravipudi,mahesh Babu,mahesh Babu Sarileru Nikevvaru,mind Block Hit

టాలీవుడ్ లో తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం థియేటర్లలో మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు.

Mahesh Babu Doing Sensational Comments On Anil Ravipudi-director Anil Ravipudi,mahesh Babu,mahesh Babu Sarileru Nikevvaru,mind Block Hit-Telugu Trending Latest News Updates-Mahesh Babu Doing Sensational Comments On Anil Ravipudi-Director Ravipudi Mahesh Sarileru Nikevvaru Mind Block Song Hit

అలాగే ఈ చిత్రంలో మహేష్ బాబుకి జోడీగా రష్మిక మందన నటించగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, సత్యదేవ్, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు.అయితే ఈ చిత్రం కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లను రాబడుతోంది.

ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే ఈ చిత్రం వంద కోట్ల క్లబ్ లో చేరి పోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.అయితే ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా తాజాగా హీరో మహేష్ బాబు ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఈ చిత్రంలోని మైండ్ బ్లాక్ పాట చాలా బాగా వచ్చిందని అంతేగాక మంచి ప్రేక్షకాదరణ పొందిందని ఇలాంటి పాటలని మీ తర్వాతి సినిమాలో చూపిస్తారా అని అడిగారు.దీంతో మహేష్ బాబు సమాధానమిస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి తనకు మామూలు ఫిట్టింగ్ పెట్టలేదని, ఈ పాట చాలా మంచి హిట్ అయింది కనుక తన తర్వాతి సినిమాల్లో కూడా అభిమానులు ఇటువంటి పాటల్ని కోరుకుంటారని కాబట్టి తప్పక చేయాల్సి ఉంటుందని అన్నారు.

అంతేకాక కర్నూల్ లో ఉన్నటువంటి కొండారెడ్డి బురుజు సెంటర్ తన తనకు చాలా స్పెషల్ అని అన్నారు.అంతేగాక గతంలో తాను నటించినటువంటి ఒక్కడు చిత్రంలో కూడా కొండారెడ్డి బురుజు సెంటర్ దగ్గర మూడు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నానని అన్నారు.

అప్పుడు ఆ చిత్రం కూడా ఎంత హిట్ అయ్యిందో ఇప్పుడు ఈ సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా అదే రేంజ్ లో హిట్ అయింది.దాంతో కొండారెడ్డి బురుజు సెంటర్ తనకు ఎంతో స్పెషల్ అని చెప్పుకొచ్చాడు మహేష్ బాబు.

తర్వాత తన తర్వాతి సినిమాలో హీరోయిన్ ఎవరని అడగగా తనకు తెలియదని కుదిరితే మీరే వెతికి పెట్టాలని మహేష్ బాబు తన అభిమానుల్ని రిక్వెస్ట్ చేశాడు.

తాజా వార్తలు

Mahesh Babu Doing Sensational Comments On Anil Ravipudi-director Anil Ravipudi,mahesh Babu,mahesh Babu Sarileru Nikevvaru,mind Block Hit Related....