SSMB28 : ఇలాంటి మాస్ ను త్రివిక్రమ్‌ డీల్‌ చేయగలడా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌( Trivikram ) ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన సినిమాల్లో హీరోలు మరియు హీరోయిన్స్ దాదాపు అంతా కూడా క్లాస్ గా ఉన్నత స్థాయి కుటుంబాలకు చెందిన వారే అవ్వడం జరిగింది.మాస్ ఆడియన్స్ ను అదే కాన్సెప్ట్‌ తో మెప్పించే ప్రయత్నం చేశాడు.

 Mahesh Babu And Trivikram Movie Update 2-TeluguStop.com

కానీ ఈసారి హీరో పాత్ర ను పూర్తి మాస్ గా చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.ఎంతటి మాస్ అంటే హీరో బీడీ తాగేంత మాస్.

ఈ మధ్య కాలంలో హీరోలు బీడీలు తాగుతున్నారా… ముఠా మేస్త్రీ( mutamesthri ) సినిమా లో చిరంజీవి( Chiranjeevi ) బీడీ తాగాడు.మళ్లీ ఇన్నాళ్ల తర్వాత మహేష్ బాబు ను అలా చూపించబోతున్నారు.

ఇది ఎంత వరకు వర్కౌట్‌ అయ్యేనో అర్థం కావడం లేదు అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.అందుకు కారణం ఈ మధ్య కాలం లోనే కాకుండా త్రివిక్రమ్‌ ఎప్పుడు కూడా ఇలాంటి కాస్త సీరియస్ మాస్‌ కథ లను మరియు హీరో పాత్ర లను డీల్‌ చేసిందే లేదు.

కానీ ఈసారి మహేష్ బాబు తో కలిసి చేస్తున్న సినిమా లో మాస్‌ ఎలిమెంట్స్ ను ఓ రేంజ్ లో చూపించబోతున్నాడు.నేడు టైటిల్ ను రివీల్‌ చేయబోతున్నారు.

Telugu Mahesh Babu, Ssmb, Trivikram-Movie

మహేష్ బాబు లుక్ ను ఇప్పటికే రివీల్‌ చేయడం జరిగింది. కృష్ణ జయంతి సందర్భంగా భారీ ఎత్తున ఆయన పాత సినిమా మోసగాళ్లకు మోసగాడు సినిమా ను రీ రిలీజ్ చేయడం జరిగింది.ఆ సినిమా తో కలిపి మహేష్ బాబు సినిమా యొక్క వీడియోను విడుదల చేయబోతున్నారు.ఆ వీడియో లో టైటిల్ ను రివీల్‌ చేయబోతున్నారు.మొత్తానికి మరో రేంజ్ లో త్రివిక్రమ్‌ దర్శకత్వం లో మహేష్ బాబు హీరోగా చేస్తున్న సినిమా ఉంటుందని కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం త్రివిక్రమ్‌ బీడీ రేంజ్ మాస్ ఎలిమెంట్స్ ను సరిగా చూపించగలడా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా లో పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటిస్తుండగా కీలక పాత్ర లో శ్రీలీల నటిస్తున్న విషయం తెల్సిందే.

భారీ అంచనాల నడుమ రూపొందిన మహేష్ బాబు.త్రివిక్రమ్‌ గత సినిమా లు బాక్సాపీస్ వద్ద నిరాశ పరిచాయి.

కానీ ఈ సినిమా మెప్పిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube