మహష్‌, త్రివిక్రమ్‌ మూవీ టైటిల్ ఆ రెండూ కావు

సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు 28వ సినిమా ను త్రివిక్రమ్‌ తో అధికారికంగా ప్రకటించారు.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా లో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనే విషయమై గత కొన్నాళ్లుగా మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

 Mahesh Babu And Trivikram Movie Title Not Confirm-TeluguStop.com

కియారా అద్వానీ అంటూ కొందరు కాదు పూజా హెగ్డే అంటూ మరి కొందరు అంటున్నారు.ఇదే సమయంలో జాన్వీ కపూర్ ను కూడా సంప్రదించారనే వార్తలు కూడా వచ్చాయి.

మొత్తానికి పూజా హెగ్డే ఖరారు అంటూ కాస్త బలంగా వార్తలు వినిపిస్తున్నాయి.త్వరలోనే ఆ సినిమా కు సంబంధించిన టైటిల్‌ ను రివీల్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 Mahesh Babu And Trivikram Movie Title Not Confirm-మహష్‌, త్రివిక్రమ్‌ మూవీ టైటిల్ ఆ రెండూ కావు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదే సమయంలో సినిమా టైటిల్ గురించి అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి.మహేష్‌ బాబు మరియు త్రివిక్రమ్‌ ల కాంబోలో సినిమా ను పట్టాలెక్కించే తేదీ అధికారికంగా రావాల్సి ఉంది.

ఇదే సమయంలో ఈ సినిమా కు సంబంధించిన కీలక వార్తలు వచ్చాయి.

అతడు సినిమా లో మహేష్‌ బాబు పార్థు అనే పాత్ర లో కనిపించాడు.

నందు మరియు పార్ధు పాత్రల్లో మహేష్‌ బాబు కనిపించాడు కనుక ఆ సినిమా లో పాత్రలను ఈ సినిమా కు లింక్ చేసి పార్ధు అనే సినిమా టైటిల్‌ ను అనుకుంటున్నారు అంటూ వార్తలు వచ్చాయి.ఇదే సమయంలో నంద గోపాల్‌ అనే పేరు కూడా పరిశీలనకు వచ్చింది.

దాంతో త్రివిక్రమ్‌ మరియు మహేష్‌ బాబు ల కాంబో సినిమా కు టైటిల్ విషయమై మీడియాలో గందరగోళ వాతావరణం నెలకొంది. మే 31 వ తారీకున సినిమా కు సంబంధించిన ఫస్ట్‌ లుక్ లేదా టైటిల్‌ లోగోను ఆవిష్కరించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఆ లోపు టైటిల్ ను అధికారికంగా ఖరారు చేయాలి.కాని ఇప్పటి వరకు టైటిల్ ఎంపిక కాలేదు అంటూ వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా టైటిల్‌ విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయట.అ అక్షరం కలిసి వచ్చేలా ఈ సినిమా టైటిల్ ను అనుకుంటున్నారు.

#Trivikram #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు