మహేష్‌ గుమ్మడి కాయ కొట్టక ముందే త్రివిక్రమ్‌..!

మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు.పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట షూటింగ్‌ ముగిసిన తర్వాత త్రివిక్రమ్‌ మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు.

 Mahesh Babu And Trivikram Movie Shooting This Year-TeluguStop.com

కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సర్కారు వారి పాట తాజా షెడ్యూల్‌ ను ముగించిన తర్వాత త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కబోతుందని అంటున్నారు.మహేష్‌ బాబు ఒకే సారి రెండు సినిమాలు చేయడం చాలా ఏళ్ల తర్వాత ఇదే.ఆయన అభిమానులు ఏడాదికి రెండు మూడు సినిమాలు కోరుకుంటున్నారు.ఎట్టకేలకు ఆయన నుండి వచ్చే ఏడాది రెండు సినిమాలు రాబోతున్నాయి.2020 సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్‌ బాబు ఆ తర్వాత కరోనా కారణంగా ఇప్పటి వరకు సినిమాను తీసుకు రాలేదు.

రెండేళ్ల గ్యాప్ తర్వాత సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

 Mahesh Babu And Trivikram Movie Shooting This Year-మహేష్‌ గుమ్మడి కాయ కొట్టక ముందే త్రివిక్రమ్‌..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని తదుపరి సినిమాకు ఎక్కువ బ్రేక్ తీసుకోకుండా రెండు మూడు నెలల గ్యాప్‌ లోనే త్రివిక్రమ్‌ తో చేయబోతున్న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.కుదిరితే వచ్చే ఏడాదిలోనే మరో సినిమాను కూడా విడుదల చేయాలని ఆ తర్వాత జక్కన్న తో సినిమాకు వెళ్లాలని మహేష్‌ బాబు భావిస్తున్నాడట.

ఈ విషయమై ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Telugu Film News, Mahesh Babu, Mahesh Trivikram Mvoie Update, Parashuram, Rajamouli, Sarkaru Vaari Pata, Sarkaru Vari Pata, Tollywood, Trivikram-Movie

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా కోసం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది.అతి త్వరలోనే షూటింగ్‌ ను కూడా మొదలు పెట్టాలి కనుక ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ లో త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడట.ఈ సినిమా లో హీరోయిన్‌ ఎవరు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

మహేష్‌ బాబు వచ్చే ఏడాది రెండు సినిమాలు విడుదల చేయాలని పట్టుదలతో ఉన్న మహేష్‌ బాబు కోసం దర్శకులు ఇద్దరు కూడా చాలా కష్టపడుతున్నారు.

#Trivikram #MaheshTrivikram #Rajamouli #Mahesh Babu #Parashuram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు