మహేష్‌, త్రివిక్రమ్‌ దసరాకు ఇవ్వబోతున్న గిఫ్ట్‌ ఏంటీ భయ్యా?

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట మంచి విజయాన్ని సొంతం చేసుకుంది, మొదట నెగిటివ్ టాక్ దక్కించుకున్న ఆ తర్వాత వసూళ్లు సినిమా సక్సెస్ అయ్యింది అన్నట్లుగా వచ్చాయి.ఆ సినిమా తర్వాత మహేష్ బాబు వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వం లో సినిమా చేయాల్సి ఉంది.

 Mahesh Babu And Trivikram Movie Dasara Special , Mahesh Babu, Trivikram Movie,-TeluguStop.com

కానీ కొన్ని కారణాలవల్ల త్రివిక్రమ్ ఆలస్యం చేశాడు.మహేష్ బాబు మరింత ఆలస్యం చేశాడు.

ఆ విషయాన్ని పక్కన పెడితే ఇటీవలే ప్రారంభమైన వీరిద్దరి కాంబో సినిమా నుండి దసరా కు ఎలాంటి సర్ప్రైజ్ ఉంటుందా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఒక రేంజ్ లో ఊహించుకుంటూ 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు.

 Mahesh Babu And Trivikram Movie Dasara Special , Mahesh Babu, Trivikram Movie,-TeluguStop.com

ఎట్టకేలకు వీరి కాంబో సెట్ అయ్యింది.ప్రారంభం కూడా అయింది.మరి ఈ సినిమా ను వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.కనుక దసరాకు చిన్న అప్డేట్ అయినా ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా ఒక చిన్న వీడియో ను త్రివిక్రమ్ విడుదల చేశాడు, కనుక దసరా సందర్భంగా కూడా కచ్చితంగా త్రివిక్రమ్ నుండి పెద్ద సర్ప్రైజ్ ఉండే అవకాశం ఉందని మహేష్ బాబు అభిమానుల్లో కొందరు ఆశగా ఉన్నారు.టైటిల్ అనౌన్స్మెంట్ విషయమై మొదట చర్చ జరిగిందట, కానీ కాస్త ఆలస్యంగా టైటిల్ని ప్రకటిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాయిదా వేశారు.

ఇప్పటికే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ జరిగింది.కనుక అందులోంచి ఒక మంచి స్టిల్ ని విడుదల చేసే అవకాశాలు కూడా లేకపోలేదు అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

మొత్తానికి దసరాకు మహేష్ అభిమానులను సంతృప్తి పరచేందుకు త్రివిక్రమ్ ఏదో ఒకటైతే చేస్తాడని తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube