మహేష్‌, రాజమౌళి మూవీ.. అవన్నీ పుకార్లేనట

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి బాహుబలి సినిమా సమయంలోనే తన తదుపరి సినిమా ను మహేష్‌ బాబుతో చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.మహేష్‌ బాబుతో సినిమా కోసం బాహుబలి తర్వాత ప్రయత్నాలు చేసినా కూడా వర్కౌట్‌ అవ్వలేదు.

 Mahesh Babu And Rajamouli Movie News And Rumors Clarity-TeluguStop.com

ఒక భారీ మల్టీ స్టారర్‌ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్‌ మరియు చరణ్ లతో సినిమాను మొదలు పెట్టారు.ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా తర్వాత మహేష్‌ బాబు తో కేఎల్ నారాయణ నిర్మాణంలో రాజమౌళి సినిమా చేయడం పక్కా.

ఈసారి మాత్రం ఖచ్చితంగా జక్కన్న మహేష్‌ బాబుల కాంబోలో సినిమా ఉంటుందని అంటున్నారు.మహేష్ బాబు సైతం రాజమౌళి తో సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు.

 Mahesh Babu And Rajamouli Movie News And Rumors Clarity-మహేష్‌, రాజమౌళి మూవీ.. అవన్నీ పుకార్లేనట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సమయంలో వీరి కాంబో మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.దాంతో సినిమాకు సంబంధించిన చిన్న విషయం కూడా పెద్దగా మీడియాలో చర్చనీయాంశంగా నిలుస్తోంది.

మహేష్‌ బాబు ను చత్రపతి శివాజీ మహారాజ్ గా జక్కన్న చూపించబోతున్నాడు అనేది ప్రధానంగా వినిపిస్తున్న పుకారు.రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ ను మొదలు పెట్టాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

కరోనా లాక్‌ డౌన్‌ సమయంలో మహేష్ బాబు సినిమా కు సంబంధించిన కథా చర్చలు జరిగాయని అంటున్నారు.కనీసం రెండేళ్ల పాటు సినిమా ను షూట్‌ చేసే అవకాశాలు ఉన్నాయట.

ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత కనీసం ఏడాది కాలం అయినా జక్కన్న బ్రేక్‌ తీసుకుంటాడని చెబుతున్నారు.ఈ సమయంలోనే జక్కన్న రాజమౌళి కథను మరింతగా పదును పెట్టి తయారు చేస్తాడని అంటున్నారు.

అయితే ఇప్పటి వరకు సినిమా గురించి వచ్చిన పుకార్లపై జక్కన్న టీమ్‌ మెంబర్స్ స్పందించారు.చత్రపతి శివాజీ పాత్ర లో మహేష్‌ బాబు అంటూ వచ్చిన వార్తలతో పాటు సినిమా హాలీవుడ్‌ రేంజ్‌ లో ఉంటుందనే వార్తలను కూడా కొట్టి పారేశారు.

ఇప్పటి వరకు సినిమా కు సంబంధించి ఒక్క అడుగు కూడా పడలేదు.కథ విషయంలో ఇంకా చర్చలు కూడా జరగలేదు.అప్పుడే శివాజీ మహారాజ్ అంటూ ప్రచారం చేయడం తగదు అంటూ జక్కన్న టీమ్‌ మెంబర్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

#Rajamouli #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు